South Africa T20 League
South Africa T20 League: ఇటీవల సౌత్ ఆఫ్రికా 20 లీగ్ ముగిసింది. ఫైనల్ మ్యాచ్లో కావ్య పాప టీం, ముఖేష్ అంబానీ టీం పోటీపడ్డాయి. చివరికి ముకేశ్ అంబానీ టీం గెలిచింది. ముకేశ్ అంబానీ ఇక్కడ ముంబై కేప్ టౌన్ పేరుతో జట్టును కొనసాగిస్తున్నారు.. కావ్య పాప సన్ రైజర్స్ ఈస్టర్న్ కేఫ్ పేరుతో జట్టును కలిగి ఉంది. గత రెండు సీజన్లలో కావ్య పాప టీమ్ విజేతగా నిలిచింది. అయితే ఇటీవల జరిగిన ఫైనల్ మ్యాచ్లో ముంబై జట్టు కో ఓనర్ ఆకాశ్ అంబానీ- కావ్య మారన్ కలిసి ఒక ఫోటో దిగారు. ఈ క్రమంలో ఒకరినొకరు మర్యాదపూర్వకంగా ఆలింగనం చేసుకున్నారు. వారిద్దరూ తమ తమ జట్లకు యజమానులైనప్పటికీ.. ఫైనల్ మ్యాచ్లో ప్రత్యర్థులుగా పోటీపడుతున్నప్పటికీ.. ఆటగాళ్లల్లో మాత్రం క్రీడా స్ఫూర్తిని నింపారు. ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత తమ జట్ల పోరాట పటిమను గుర్తు చేసుకుంటూ అభినందించుకున్నారు. హార్థిక శుభాకాంక్షలు అని కావ్య పాప అంటే.. గొప్ప పోరాటాన్ని చూపించారని ఆకాశ్ అంబానీ వ్యాఖ్యానించాడు. అలా వారిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. మధ్యమధ్యలో నవ్వుకున్నారు. అయితే ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకునే కావ్య.. ఈసారి చిరునవ్వులు చిందించింది. దీంతో ఆమె ఫోటోలను నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. పలు ఆసక్తికరమైన కామెంట్ చేస్తున్నారు.
అలా కనిపిస్తే చాలు
సన్ రైజర్స్ జట్టు ద్వారా కావ్య పాప దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. ముఖ్యంగా తెలుగులో అయితే ఆమెకు వీరాభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో ఆమె పేరుతో కొన్ని వందల గ్రూపులను మెయింటైన్ చేస్తున్నారు. కావ్య పాప మైదానంలో అలా కనిపిస్తే చాలు జన్మ ధన్యమైందని అనుకునే వారు చాలామంది ఉంటారు. ఆమె అందానికి.. నవ్వుకు ఫిదా అయినవారు కోకోల్లలు. ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్నంత సేపు.. కావ్య పాప మైదానంలోకి వస్తే చాలు అభిమానులు గోల గోల చేస్తుంటారు. ఆటగాళ్లను అభినందిస్తూనే.. వారిలో క్రీడా స్ఫూర్తి నింపుతూనే.. అభిమానులను ఆకట్టుకునేందుకు కావ్య ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.. చేతులు ఊపుతూ వారికి సంకేతాలు ఇస్తుంది. గాల్లోకి ముద్దులు విసిరి తన ప్రేమను వ్యక్తం చేస్తుంది. ఇటీవల జరిగిన సౌత్ ఆఫ్రికా t20 లీగ్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేఫ్ జట్టు ఫైనల్ మ్యాచ్లో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో ముంబై జట్టు విజేతగా నిలిచింది. ముంబై జట్టు విజయం సాధించిన నేపథ్యంలో..ఆ జట్టు యజమాని ఆకాష్ అంబానీ ని కావ్య అభినందించింది. మీ ఆటగాళ్లు గొప్ప ప్రదర్శన చేశారంటూ కితాబిచ్చింది. ఓటమి బాధను మరచిపోయి ఆకాశ్ అంబానీతో సరదాగా ముచ్చటించింది. మధ్య మధ్యలో ముసి ముసి నవ్వులు నవ్వింది. అయితే ఈ ఇద్దరు బిలినియర్లు కలుసుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో చాలాసార్లు వారిద్దరూ మీట్ అయ్యారు. కాకపోతే ఈ స్థాయిలో ముచ్చటించుకునే అవకాశం వారికి లభించలేదు. మొత్తానికి ఫైనల్ మ్యాచ్ ద్వారా లభించిన అవకాశాన్ని ఆకాష్, ఇటు కావ్య వినియోగించుకున్నారు. వేలకోట్ల రూపాయల విలువైన సన్ గ్రూప్ కు కావ్య ఒక్కరే వారసురాలు. ఇక ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడిగా ఆకాశ్ అంబానీ పలు కంపెనీల వ్యవహారాలను చూసుకుంటున్నాడు.
Aakash Ambani and Kavya Maran after the end of the SA20 final between MI Cape Town and Sunrisers Eastern Cape
: Betway SA20#Cricket #MumbaiIndians #Sunrisers pic.twitter.com/BtY7aNOYk0
— OneCricket (@OneCricketApp) February 11, 2025