Remake Movie
Remake Movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ (Venkatesh) గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసి పెట్టింది. మరి ఇలాంటి సందర్భాల్లోనే ఎన్నో సినిమాలతో ఆయన మంచి విజయాలు అందుకున్నాడు. అలాగే ఆయన చేసిన సినిమాల్లో చాలా వరకు రీమేక్ సినిమాలే ఉంటాయి. ఆయన రీమేక్ చేసిన చాలా సినిమాకు మంచి విజయాలను అందుకున్నాయి. కానీ ఒక సినిమా మాత్రం ప్లాప్ అయింది. అన్ని భాషల్లో మంచి విజయాన్ని సంపాదించుకున్నప్పటికి తెలుగులో మాత్రం డిజాస్టర్ బాట పట్టింది. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే బాడీగార్డ్(bodyguard) సినిమా కావడం విశేషం… మొదట మలయాళంలో తెరకెక్కించిన ఈ సినిమా ఆ తర్వాత హిందీలో వచ్చి మంచి విజయాన్ని సాధించింది. కానీ తెలుగులో మాత్రమే ఈ సినిమా ప్లాప్ అయింది.గోపి చంద్ మలినేని (Gopichand Malineni) డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని మెప్పించలేకపోయింది. అయితే రిలీజ్ కి ముందు ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ సినిమాలో ఉన్న కొన్ని సీన్లను మార్చడం వల్ల కోర్ ఎమోషన్ అనేది ప్రేక్షకులకు అంత బాగా కనెక్ట్ కాలేదు. దాని వల్ల సినిమా అనేది ఆశించిన మేరకు విజయం అయితే సాధించలేదు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా సక్సెస్ అయితే వెంకటేష్ కెరీర్ అనేది అప్పట్లోనే వెళ్ళిపోయింది.
కానీ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆ తర్వాత కూడా వచ్చిన కొన్ని సినిమాల ద్వారా వెంకటేష్ మార్కెట్ అనేది కొంతవరకు డౌన్ అయిందనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాలను భారీ రేంజ్ లో ఎలివేట్ చేయడానికి ఆయన ఎప్పటికప్పుడు కసరత్తులు చేసుకుంటూ ఉంటాడు.
ఇక రీసెంట్ గా ‘సంక్రాంతి వస్తున్నాం’ (Sankranthiki Vastunnam) సినిమాతో భారీ విజయాన్ని సాధించిన ఆయన 350 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టాడు. మరి ఎట్టకేలకు సంక్రాంతికి వస్తున్నాం సినిమా అయితే ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలిచింది.
కాబట్టి ఇక మీదట కూడా మంచి సినిమాలు చేసుకుంటూ తన మార్కెట్ ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉండాలని ఆయన తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నాడు. రాబోయే రోజుల్లో మంచి సినిమాలు చేస్తూ అందరికీ భారీ రేంజ్ లో ఎంటర్ టైన్ మెంట్ ను పంచుతూ ముందుకు సాగుతున్నాడనే చెప్పాలి.