Mahesh Babu- Jr. NTR Movie
Jr. NTR – Mahesh : సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), రాజమౌళి(#SSRMB) కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా, ఫారెస్ట్ అడ్వెంచర్ జానర్ లో ఉండబోతుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఇందుకోసం అమెజాన్ అడవుల్లో షూటింగ్ లొకేషన్స్ ని కూడా ఎంచుకొని వచ్చాడు డైరెక్టర్ రాజమౌళి(Rajamouli). హైదరాబాద్ లో నెల రోజుల పాటు సాగే షెడ్యూల్ పూర్తి అయ్యాక, అమెజాన్ అడవుల్లో రెండవ షెడ్యూల్ కి సంబంధించిన షూటింగ్ జరగనుంది. హాలీవుడ్ స్థాయిలో సుమారుగా వెయ్యి కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న సినిమా, ప్రపంచం లో ఉన్న అన్ని భాషల్లోనూ ఒకేసారి విడుదల కాబోతుంది. ఇందులో ప్రియాంక చోప్రా విలన్ గా నటిస్తుండగా, హీరోయిన్ రోల్ కోసం విదేశీ భామ ని ఎంచుకోబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా కోసం మహేష్ బాబు ఏ రేంజ్ లో తన లుక్ ని మార్చుకున్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం.
ఒకపక్క మహేష్, రాజమౌళి సినిమా అడవుల్లో షూటింగ్ జరుపుకోబోతుంటే, మరో క్రేజీ కాంబినేషన్ ఎన్టీఆర్(Junior Ntr), ప్రశాంత్ నీల్(Prasanth Neel) మూవీ కూడా అడవుల్లోని షూటింగ్ ని మొదలు పెట్టుకోనుంది. రాజమౌళి, మహేష్ కాంబినేషన్ తర్వాత పాన్ ఇండియా లెవెల్లో ఆ రేంజ్ క్రేజ్ ఈ కాంబినేషన్ కి మాత్రమే సొంతం. యాదృచ్చికం ఏమిటంటే అన్నదమ్ములుగా పిలవబడే ఈ ఇద్దరు హీరోల సినిమాలు అడవుల నేపథ్యంలో రావడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. ప్రస్తుతం ‘వార్ 2’ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్న ఎన్టీఆర్, ఈ సినిమా పూర్తి అవ్వగానే ప్రశాంత్ నీల్ సినిమాకు షిఫ్ట్ అవ్వబోతున్నాడు. ఈ నెలాఖరు తోనే ‘వార్ 2(War2 Movie)’ మూవీ షూటింగ్ పూర్తి అవ్వబోతుందని టాక్. ఆగస్టు నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ విశేషాలు దగ్గరకు వస్తే, ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణీ వాసంత్ నటించబోతుంది.
కేజీఎఫ్ సిరీస్, సలార్ సినిమాలకు సంగీతం అందించిన రవి బర్సుర్, ఈ చిత్రానికి కూడా సంగీతం అందించనున్నాడు. మలయాళం సూపర్ స్టార్ తొనివో థామస్ ఇందులో కీలక పాత్ర పోషించనున్నాడు. ఈ చిత్రానికి ‘డ్రాగన్(Dragon Movie)’ అనే టైటిల్ ని పెట్టేందుకు పరిశీలించారు కానీ, అదే టైటిల్ తో తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ ఒక సినిమా చేయడంతో ఆ టైటిల్ కి బదులుగా వేరే టైటిల్ ని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రం షూటింగ్ ని సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పై ఈ చిత్రం నిర్మాణం జరగనుంది. ఉగాది సందర్భంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుండి అప్డేట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఈ చిత్రం ఏ రేంజ్ బాక్స్ ఆఫీస్ సెన్సేషన్ ని సృష్టించబోతోంది అనేది.