Zimbabwe beat Australia: T20WC చరిత్రలోనే సంచలనం నమోదైంది. నేడు జరిగిన ఆస్ట్రేలియా VS జింబాబ్వే మ్యాచ్ లో దిగ్గజ ఆస్ట్రేలియా టీం పై జింబాబ్వే టీం 23 పరుగుల తేడా తో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ని ఎంచుకున్న జింబాబ్వే టీం 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టం తో 169 పరుగులు చేసింది. చాలా చిన్న టార్గెట్, ఆస్ట్రేలియా టీం కేవలం 15 ఓవెర్స్ లో మ్యాచ్ ముగుస్తుందని సోషల్ మీడియా లో అందరూ బెట్టింగ్స్ వేసుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా జింబాబ్వే బౌలర్లు దాటికి ఆస్ట్రేలియన్ బ్యాట్స్ మెన్స్ నిలబడలేకపోయారు. కేవలం 19.3 ఓవెర్స్ లో 146 పరుగులకే ఆస్ట్రేలియన్ టీం మొత్తం ఆల్ అవుట్ అయ్యింది. ఈ రేంజ్ ఓటమి ని ఆస్ట్రేలియన్స్ కలలో కూడా ఊహించి ఉండరేమో అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.
ఆస్ట్రేలియా టీం లో కేవలం మాట్ రెన్షా ఒక్కటే 65 పరుగులు తీశారు. మిగిలిన వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు అవుట్ అవుతూ పెవీలియన్ కి చేరుకున్నారు. జింబాబ్వే బౌలర్లలో ముజారబానీ 4 వికెట్లు తీసుకోగా, బ్రాడ్ ఇవాన్స్ 3 వికెట్లు, విల్లింగ్ స్టన్, ర్యాన్ లు చెరో ఒక వికెట్ ని తీశారు. ఈరోజు జరిగిన ఈ మ్యాచ్ 2007 వ సంవత్సరం లో జరిగిన T20WC మ్యాచ్ ని గుర్తు చేసింది. అప్పట్లో కంగారులపై జింబాబ్వే టీం ఇదే తరహా లో విజయం సాధించి చరిత్ర సృష్టించారు. మళ్లీ 19 ఏళ్ళ తర్వాత ఆ హిస్టరీ ని రేపటి చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. క్రికెట్ రంగం లో జింబాబ్వే టీం చాలా వీక్ అని అందరూ అంటుంటారు. ఆస్ట్రేలియన్ టీం ని తోపు టీం గా వర్ణిస్తుంటారు. అలాంటి టీం ని ఇంత దారుణంగా జింబాబ్వే ఓడించడం నిజంగా హిస్టరీ నే. ఇదే తరహా జోరుని రాబోయే మ్యాచులలో కూడా జింబాబ్వే కొనసాగిస్తుందో లేదో చూడాలి.