India Vs West Indies: 17 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా టీమిండియా వెస్టిండీస్ చేతిలో ఓడిపోయింది. ఐదు మ్యాచుల్లో టి20 సిరీస్ ప్రారంభంలోనే రెండు వరస ఓటములు ఎదురు కావడం క్రికెట్ అభిమానులను నిరాశపరిచింది. ఆ తర్వాత మూడవ మ్యాచ్ సమయానికి పుంజుకున్న భారత జట్టు తర్వాత రెండు మ్యాచ్ లలో గెలుపు సాధించింది. చివరి నిర్ణయాత్మకమైన ఫిఫ్త్ మ్యాచ్ను విండీస్ కైవసం చేసుకోవడంతో భారత్ ఈ సీరిస్ ని పోగొట్టుకుంది.
ఓడిపోయాను అని బాధపడే కంటే కూడా ఈ ఓటమి నుంచి ఇప్పటికైనా భారత్ జట్టు కొన్ని విషయాలను తెలుసుకుంటే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది కలగదు అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొదటగా బ్యాటింగ్ విషయానికి వస్తే..టీ20 ఫార్మాట్‌లో టీమిండియా మరింత మెరుగైన ప్రదర్శన కనబరుస్తూ అగ్రెసివ్ గా ఆడితే బాగుంటుంది అని రోహిత్ శర్మ లాస్ట్ ఇయర్ నుంచి చెబుతూనే ఉన్నాడు.
అవి కేవలం మాటల వరకే పరిమితం అవుతున్నాయి తప్ప ఆచరణలో వచ్చే అవకాశం కనిపించడం లేదు. మరోపక్క సీనియర్ ప్లేయర్లు టీం లో లేకపోతే ఇక ఆరోజు ప్లేయర్స్ మ్యాచ్ ఆడడానికి తెగ ఇబ్బంది పడుతున్నారు. విండీస్ టీం ను గమనించినట్లయితే పదవ వికెట్ వరకు ప్రతి ప్లేయర్ భారీ షాట్లు ఆడగలిగే కెపాసిటీతో ఉన్నారు. కానీ అదే టీమ్ ఇండియా విషయంలో ఎక్కడా కనిపించడం లేదు.
గత సంవత్సరం నుంచి టీమిండియాను వెంటాడుతున్న మరొక సమస్య సరి అయిన ఫినిషిర్ లేకపోవడం. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్‌లలో సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా తమ వంతు ప్రయత్నించినప్పటికీ వారు మంచి ఫినిషర్స్ గా రాణించలేకపోయారు. కాబట్టి ఇప్పటికైనా టీమిండియా రింకు సింగ్, జితేష్ శర్మ లాంటి నాచురల్ ఫినిషర్స్ కు జట్టులో ఆస్కారం కల్పించడం మంచిది.
సంజూ లాంటి టాప్ ఆర్డర్ ప్లేయర్ ను ఫినిషర్ గా పంపడం జట్టుకు ఒకరకంగా నష్టాన్ని కలిగిస్తుంది తప్ప ఎటువంటి లాభాన్ని చేకూర్చదు. ప్రతి టీం కి ఒక స్పెషలిస్ట్ ఫినిషర్ ఉండడం ఎంతో అవసరం అన్న విషయం ఇకనైనా సెలక్షన్ కమిటీ గుర్తిస్తే బాగుంటుంది. టీంలోకి తీసుకునే ప్లేయర్ల విషయంలో స్పష్టత లేకపోతే ఇప్పుడు విండీస్ తో ఏదైతే జరిగిందో అదే మిగిలిన ఆటల్లో కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉంది.
గత ఏడాది టీ 20 వరల్డ్ కప్ అడని యుజ్వేంద్ర చాహల్ , ఈసారి టీం లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ నిలకడైన ప్రదర్శన కనబరచ లేకపోయాడు.ఈ వెటరన్ స్పిన్నర్ తన మ్యాజిక్ తో విండీస్ ప్లేయర్స్ తో ఆడుకుంటాడు అని ఎక్స్పెక్ట్ చేసి టీమ్ లోకి తీసుకుంటే… చివరి టీ 20 మ్యాచ్ లో విండీస్ బ్యాటర్లు అతనితో ఆడుకున్నారు. ఇక ఈ ఫార్మాట్ కి అతను పెద్దగా సెట్ కాడు అన్న విషయం ఈ సిరీస్ తో స్పష్టం అయిపోయింది. కాబట్టి ఈ సిరీస్ లో జరిగిన ప్రతి తప్పిదాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచించి తిరిగి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటే టీమిండియా ఆట తీరు మెరుగుపడుతుంది అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.