Jailer Collections: సూపర్ స్టార్ రజినీకాంత్, రమ్యకృష్ణ ప్రధానంగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, మలయాళం మెగాస్టార్ మోహన్ లాల్, తమన్నా అతిథి పాత్రల్లో నటించిన జైలర్ సినిమా వరల్డ్ వైడ్ గా వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. సినిమాకు హిట్ టాక్ వస్తే సూపర్ స్టార్ స్టామినా ఎలా ఉంటుందో మరోసారి బాక్స్ ఆఫీస్ గా రుజువు చేస్తుంది జైలర్ సినిమా. విడుదలైన అన్ని చోట్ల ప్రభంజనం సృష్టిస్తూ భారీ విజయం దిశగా అడుగులు వేస్తుంది.
కేవలం మూడంటే మూడు రోజుల్లో సినిమా బ్రేక్ ఈవెన్ కావటమే కాకుండా భారీ లాభాల దిశగా వెళ్తుంది ఈ సినిమా. మొదటి వీకెండ్ లో మూడు వందల కోట్లు సాధించిన ఈ సినిమా తర్వాత రెండు మూడు రోజుల్లో మరో 100 కోట్లు సాధించింది. తాజాగా ఇండిపెండెన్స్ రోజు (ఆగస్టు 15) సెలవు కావడంతో జైలర్ కు బాగా కలిసి వచ్చింది. ఈ ఒక్క రోజే 50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు అయ్యాయి. దీంతో ఈ సినిమా 400 కోట్ల క్లబ్ లోకి చేరింది.
కేవలం ఇండియాలో ఆరో రోజు 35 కోట్లు దాక వసూళ్లు చేసింది ఈ సినిమా, ఇక తమిళనాడు లో 18 కోట్లు దాకా రావడం విశేషం. కేవలం ఇండియా లోనే 200 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది జైలర్ మూవీ. ఈ మధ్య కాలంలో బాక్స్ ఆఫీస్ దగ్గర జైలర్ లాంటి సినిమా రాలేదనే చెప్పాలి. ఈ ప్రభంజనం చూస్తుంటే ఈ వీకెండ్ ముగిసేసరికి 500 కోట్ల మార్క్ క్రాస్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
జైలర్ మూవీ భారీ వసూళ్లు సాధిస్తున్న క్రమంలో అనేక రికార్డ్స్ ఈ సినిమా ఖాతాలో వచ్చి చేరుతున్నాయి. జైలర్ మూవీ వరల్డ్ వైడ్ గా అత్యధిక గ్రాస్ సాధించిన తమిళ సినిమాల్లో 4 వ స్థానంలో నిలిచింది. సౌత్ ఇండియా స్థాయిలో 12 వ సినిమాగా నిలిచింది. ఫైనల్ గా అత్యధిక గ్రాస్ సాధించిన ఇండియన్ సినిమాల జాబితాలో 30 వ స్థానంలో నిలిచింది. కేవలం 6 రోజుల్లోనే ఈ రికార్డ్స్ సొంతం అయ్యాయంటే ఫైనల్ రన్ ముగిసేసరికి జైలర్ రికార్డ్స్ మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.