Virat Kohli: విరాట్ కోహ్లీ.. బ్రాడ్ మన్, సచిన్ టెండుల్కర్ తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న క్రికెటర్. సమకాలీన క్రికెట్లో పరుగుల యంత్రంలాగా మన్ననలు పొందుతున్నాడు. టెస్ట్, వన్డే, టి20.. ఇలా ఏ ఫార్మాట్ అయినా బాదుడే ఇతడి లక్ష్యం. వికెట్ల మధ్య చిరుత పులిలాగా పరిగెత్తుతాడు. అలసట అనేది లేకుండా పరుగులు తీస్తాడు. అందుకే ఇతడిని టీమిండియా రాంగ్ మిషన్ అని పిలుస్తారు. సుదీర్ఘకాలం క్రికెట్లో కొనసాగుతున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో మాత్రమే తన ఫామ్ కోల్పోయాడు. ఇక మిగతా సమయాల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. వారందరికీ తన ఆట తీరుతోనే సమాధానం చెప్పాడు. కోహ్లీ ఆటకు మాత్రమే కాదు అతడి ఫిట్ నెస్ కు కూడా విపరీతమైన అభిమానులున్నారు.
సోమవారం ఐపీఎల్లో భాగంగా బెంగళూరులో పంజాబ్ జట్టుపై జరిగిన మ్యాచ్లో బెంగళూరు జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లీ తన పూర్వ ఫామ్ అందుకున్నాడు. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 77 పరుగులు చేశాడు. 49 బంతుల్లో 11 ఫోర్లు, రెండు సిక్స్ లతో అతడు ఈ ఘనత సాధించాడు. చివర్లో దినేష్ కార్తీక్ 10 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్స్ లతో 28 పరుగులు సాధించాడు. మహిపాల్ లో మ్రోర్ 8 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టి 17 పరుగులు చేశాడు. దీంతో బెంగళూరు జట్టు విజయం సాధించింది. ఐపీఎల్ తొలి మ్యాచ్లో చెన్నై జట్టుపై ఓడిపోయిన నేపథ్యంలో.. బెంగళూరు జట్టుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లీ తన ఫామ్ తిరిగి అందుకున్నాడు.
బెంగళూరు మ్యాచ్ లో ముందుగా పంజాబ్ జట్టు బ్యాటింగ్ చేసింది. అనంతరం బెయిర్ స్టో తో కలిసి ఓపెనింగ్ జోడిగా విరాట్ కోహ్లీ మైదానంలోకి వచ్చాడు. అయితే విరాట్ ను పిచ్చిగా అభిమానించే ఓ అభిమాని మైదానంలోకి దూసుకొచ్చాడు. భద్రతా అధికారుల కళ్ళు కప్పి విరాట్ కోహ్లీ కాళ్ళ మీద పడ్డాడు. దీంతో ఒక్కసారిగా విరాట్ ఆందోళన చెందాడు. అతడి భుజం మీద చెయ్యేసి ఆలింగనం చేసుకున్నాడు. అనంతరం భద్రతాధికారులు అతడిని స్టేడియం అవతలికి తీసుకెళ్లారు. కొంతమంది ఆ అభిమాని చేసిన దానికి మెచ్చుకుంటుంటే.. మరి కొంతమంది స్టేడియంలో భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక అభిమాని విరాట్ కోహ్లీ కాళ్లు పట్టుకోవడాన్ని సమర్థిస్తున్నారు. అతడు టీమిండియా పరుగుల దేవుడు.. క్రికెట్ కోసమే పుట్టాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
A fan hugging & touching the feet of Kohli.
– Kohli is an emotion for fans…!!!pic.twitter.com/NKTdXbVnNG
— Johns. (@CricCrazyJohns) March 25, 2024