https://oktelugu.com/

Actress Poonam Kaur : ఆ హీరో/నేతని ఉద్దేశిస్తూ ‘పవర్ రే%$స్ట్’ అంటూ నటి పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు..వివాదాస్పదంగా మారిన లేటెస్ట్ ట్వీట్!

ఎమ్మెల్యే ఆదిమూలం వ్యవహారం పై పూనా కౌర్ మాట్లాడుతూ 'పవర్ లో ఉన్న పార్టీ కి సంబంధించిన ఎమ్మెల్యే, అతనితో పెట్టుకోవడం ఎందుకు అని ఏమాత్రం భయం చూపకుండా ఎమ్మెల్యే వ్యవహారాన్ని బట్టబయలు చేసిన భర్తకు కృతఙ్ఞతలు. అతను అలా చేసి ఉండకపోయుంటే, నేడు టీడీపీ పార్టీ అతన్ని సస్పెండ్ చేసేది కాదు.

Written By:
  • Vicky
  • , Updated On : September 6, 2024 / 06:22 PM IST

    Actress Poonam Kaur

    Follow us on

    Actress Poonam Kaur: కొంతమంది హీరోయిన్లు సినిమాల్లో కంటే సోషల్ మీడియా లో ఎక్కువగా పాపులారిటీ ని సంపాదిస్తూ ఉంటారు. వివాదాస్పదమైన వ్యాఖ్యలతో ఎల్లప్పుడూ ట్రెండింగ్ లో ఉంటారు. అలాంటి వారిలో ఒకరు పూనమ్ కౌర్. సోషల్ మీడియా ని వేదికగా చేసుకొని ఈమె అనేకసార్లు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అనేక సందర్భాలలో ఆమె పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా విమర్శలు కూడా చేసింది. ఇలా నిత్యం వివాదాలతో సావాసం చేసే ఆమె, రీసెంట్ గా ట్విట్టర్ లో వేసిన ఒక ట్వీట్ పెను దుమారం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే ఆదిమూలం ఒక స్త్రీ పై అత్యాచారం చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన సంగతి అందరికీ తెలిసిందే.

    తెలుగు దేశం పార్టీ ఈ సందర్భంగా అతన్ని సస్పెండ్ చేసింది. అంతకుముందు వైసీపీ ఎమ్మెల్యే గా కొనసాగుతూ వచ్చిన ఆదిమూలం, సరిగ్గా ఎన్నికల సమయంలో టీడీపీ లోకి చేరాడు. ఆ పార్టీ నుండి ఎమ్మెల్యే గా గెలిచిన ఆయన ఇంతటి దారుణానికి ఒడిగట్టడం తో ఉపేక్షించని తెలుగుదేశం పార్టీ వెంటనే అతన్ని సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారం పై పూనా కౌర్ మాట్లాడుతూ ‘పవర్ లో ఉన్న పార్టీ కి సంబంధించిన ఎమ్మెల్యే, అతనితో పెట్టుకోవడం ఎందుకు అని ఏమాత్రం భయం చూపకుండా ఎమ్మెల్యే వ్యవహారాన్ని బట్టబయలు చేసిన భర్తకు కృతఙ్ఞతలు. అతను అలా చేసి ఉండకపోయుంటే, నేడు టీడీపీ పార్టీ అతన్ని సస్పెండ్ చేసేది కాదు. ఇలాంటి దుర్మార్గులు మరింత అన్యాయాలకు ఒడిగట్టేవారు. అలాగే అత్యాచారానికి గురైన ఆ అమ్మాయి ఎలాంటి భయం బెరుకు లేకుండా మీడియా ముందుకు వచ్చి అతని నిజస్వరూపం బయటపెట్టినందుకు సెల్యూట్’ అంటూ ఆమె వేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. ఇలా పూనమ్ కౌర్ సమాజం లో జరిగే ఇలాంటి సంఘటనలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంటుంది. అందుకే సినిమా ద్వారా ఆమె సంపాదించిన క్రేజ్ కంటే, సోషల్ మీడియా లో ఇలాంటి వ్యాఖ్యల ద్వారా సంపాదించిన క్రేజ్ ఎక్కువ అని అంటుంటారు విశ్లేషకులు.

    తొలుత హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించిన ఈమె, సరైన సక్సెస్ లేకపోవడం తో క్యారక్టర్ ఆర్టిస్టుగా కొనసాగింది. 2022 వ సంవత్సరం వరకు యాక్టీవ్ గా సినిమాలు చేస్తూ వచ్చిన ఆమె, ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది.అయితే ఆమె ప్రత్యేకంగా ‘పవర్ రే%$స్ట్’ అనే పదాన్ని ఎందుకు ఉపయోగించింది అనే దానిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ పై పరోక్షంగా ఆమె ఎప్పుడూ చేసే కామెంట్స్ లాగానే వాళ్ళను ఉద్దేశిస్తూ ఈ పదాన్ని ఉపయోగించిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ తనకి జల్సా సినిమాలో సెకండ్ హీరోయిన్ రోల్ ని ఇస్తానని చెప్పి మోసగించాడని, అతని వల్ల నా కెరీర్ మొత్తం సర్వ నాశనం అయ్యింది అంటూ పూనమ్ కౌర్ మాట్లాడిన మాటలు ఎంతటి దుమారం రేపిందో మనమంతా చూసాము. ఇప్పటికీ కూడా ఆమె సమయం దొరికినప్పుడల్లా ట్విట్టర్ ని వేదికగా చేసుకొని త్రివిక్రమ్ పై మండిపడుతూ ఉంటుంది.