Rohit Sharma: రోహిత్ శర్మ కాళ్లు మొక్కిన యువకుడికి షాక్…

ఇండియా ఇంగ్లాండ్ మధ్య ఉప్పల్ వేదికగా మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఇక ఇందులో ఈ మ్యాచ్ చూడటానికి వచ్చిన ఒక అభిమాని అక్కడున్న సిబ్బంది కండ్లు కప్పి గ్రౌండ్ లోకి ఎంటర్ అయి తన అభిమాన ప్లేయర్ అయిన రోహిత్ శర్మ దగ్గరికి వచ్చి అతని కాళ్లు మొక్కాడు.

Written By: Gopi, Updated On : January 26, 2024 11:14 am
Follow us on

Rohit Sharma: సినిమా హీరోలకి గాని, క్రికెట్ ప్లేయర్లకు గాని ఇండియాలో చాలా ఎక్కువ ఆదరణ ఉంటుంది. అలాగే వాళ్ళకి అభిమానులు కూడా భారీ సంఖ్యలో ఉంటారు. వాళ్ళు అభిమానించే ప్లేయర్స్ కోసం ఏదైనా చేయడానికి ఫ్యాన్స్ ఎప్పుడూ సిద్దం గా ఉంటారు. ఇంక కొంత మంది ఫ్యాన్స్ అయితే వాళ్ళు అభిమానించే వాళ్ళనే దేవుళ్ళుగా కొలుస్తూ ఉంటారు అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అందుకే ఆ హీరోలు కానీ, ఆ ప్లేయర్లు గాని కనిపించిన ప్రతిసారి ఏదో ఒక రకంగా వాళ్ళ కంటపడాలని అభిమానులు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

ఇక ఇలాంటి క్రమంలోనే ఇండియా ఇంగ్లాండ్ మధ్య ఉప్పల్ వేదికగా మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఇక ఇందులో ఈ మ్యాచ్ చూడటానికి వచ్చిన ఒక అభిమాని అక్కడున్న సిబ్బంది కండ్లు కప్పి గ్రౌండ్ లోకి ఎంటర్ అయి తన అభిమాన ప్లేయర్ అయిన రోహిత్ శర్మ దగ్గరికి వచ్చి అతని కాళ్లు మొక్కాడు. ఇక అది చూసిన పోలీసు సిబ్బంది వాళ్ల కండ్లు కప్పి అలా దొంగ చాటుగా ప్లేయర్ దగ్గరికి వెళ్లడాన్ని సహించలేక ఆ కుర్రాడి మీద పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు.

ఇక ఆ యువకుడు ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేట మండలంలోని రామచంద్రపురం అనే గ్రామానికి చెందిన హర్షిత్ రెడ్డి(20)గా గుర్తించారు. ఇలా ఇప్పుడే కాదు ఇంతకుముందు చాలాసార్లు ధోని, కోహ్లీ లాంటి ప్లేయర్ల విషయాల్లో కూడా ఇలాంటి సంఘటనలు మనం చాలా సార్లు చూశాం…ఇక వాళ్ళ అభిమాన క్రికెటర్ కండ్ల ముందే మ్యాచ్ ఆడుతుంటే ఎలాగైనా అతన్ని ఒక్కసారైనా కలవాలనే ఉద్దేశంతోనే అభిమానులు అలా చేస్తున్నారు గాని వాళ్లకు వేరే ఉద్దేశ్యం ఏదీ లేదు వాళ్ల మీద కేసులు పెట్టి జైల్లో వేసే కంటే వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తే బెటరని కొంతమంది సీనియర్ ప్లేయర్లు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకంటే ఆ యువకుడికి చదువుకునే వయసుంది ఇలాంటి సమయంలో కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయడం వల్ల వాళ్ల ఫ్యామిలీ కూడా ఇబ్బందులు పడుతుంది. కాబట్టి ఈసారికి మందలించి వదిలేస్తే బెటర్ అని అంటున్నారు. కానీ యువకులు అలా దొంగ చాటుగా క్రికెటర్లను కలవడానికి రావడం కూడా కరెక్ట్ కాదు అని మరికొంత మంది సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికైతే హర్షిత్ రెడ్డి ఉప్పల్ మ్యాచ్ లో పిచ్ లోకి వెళ్ళడం ఒక సంచలనాన్ని సృష్టించిందనే చెప్పాలి…