IPL 2025 : జై షా చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడంతో ఆటగాళ్లపై కాసుల వర్షం కురువనుంది. బీసీసీఐ తీసుకున్న తాజా నిర్ణయం ద్వారా ఐపీఎల్ లో ఒక్కో మ్యాచ్ కు ఆటగాళ్లకు 7.5 లక్షల మ్యాచ్ ఫీజు లభిస్తుంది. అయితే యాజమాన్యాలు కుదుర్చుకున్న ముందస్తు ఒప్పందానికంటే ఇది అదనంగా లభిస్తుందని తెలుస్తోంది. లీగ్ దశలో అన్ని మ్యాచ్ లు ఆడితే ఒప్పందానికి అదనంగా 1.5 కోట్లు ఆటగాళ్లకు లభిస్తాయి.. అన్ క్యాప్ డ్, ఎమర్జింగ్ ఆటగాళ్లకు ఇది జాక్ పాట్ అని క్రీడా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం వల్ల క్రికెటర్ల ఆర్థిక పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. కేవలం వేతనాల కోసమే ఫ్రాంచైజీలకు ఒక్కో సీజన్ కు 12.6 కోట్లు కేటాయిస్తున్న నేపథ్యంలో ఆటగాళ్లు పండగ చేసుకోనున్నారు. “ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఇది అద్భుతమైన ఘట్టంగా అనుకుంటున్నాం.. మనదేశంలోని ఆటగాళ్లకు ప్రత్యేకంగా మ్యాచ్ ఫీజు ను తెరపైకి తీసుకొస్తున్నాం. ఆటగాళ్లు ఒక మ్యాచ్ ఆడితే 7.5 లక్షల ఫీజు అందిస్తాం.. ఒక క్రికెటర్ ఐపిఎల్ సీజన్లో అన్ని మ్యాచ్ లు కనుక ఆడితే అతడికి కాంట్రాక్ట్ మొత్తం లభిస్తుంది.. దాంతోపాటు 1.5 కోట్లు అందుతాయి.. ప్రతి సీజన్లో జట్టు యాజమాన్యానికి మ్యాచ్ ఫీజు కింద 12.60 కోట్లు ఇస్తున్నాం. ఇది ఐపీఎల్లో నవ శకానికి నాంది. మన ఆటగాళ్లకు ఆర్థిక భరోసా కు గట్టి పునాది అని” జై షా పేర్కొన్నారు.
డబ్బులు ఎలా వస్తాయంటే..
అన్ క్యాప్ డ్ ఆటగాళ్లకు బీసీసీఐ తీసుకున్న నిర్ణయం వరం అవుతుంది. ఒక ఆటగాడు 20 లక్షలతో ఒక జట్టుకు ఆడుతున్నాడు అనుకున్నప్పుడు… అతడు ఆ సీజన్లో అన్ని మ్యాచ్ లు కనుక ఆడితే 1.5 కోట్లు లభిస్తాయి.. అయితే బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం అందరి ఆటగాళ్లకు వర్తిస్తుందా? కేవలం భారత క్రికెటర్లకు మాత్రమేనా? అనే విషయాలపై స్పష్టత లేదని క్రీడాకారులు చెబుతున్నప్పటికీ.. జై షా చేసిన ట్వీట్ లో మన ప్లేయర్లు అని స్పష్టంగా ఉంది. అందువల్ల ఈ వరాన్ని కేవలం భారతీయ క్రికెటర్లకు మాత్రమే వర్తింపజేస్తారని తెలుస్తోంది. ” క్రికెట్ అంతకంతకు విస్తరిస్తోంది. ఫుట్ బాల్ స్థాయిలో ఆదరణ దక్కించుకుంటున్నది. ఒక్కోసారి ఇది ఫుట్ బాల్ లీగ్ లను మించిపోతుంది. అందువల్ల క్రికెట్ లో నవ శకానికి నాంది పలికాలి. కొత్త ఆటగాళ్లకు అవకాశాలు కల్పించాలి. యువతరాన్ని క్రికెట్ వైపు మళ్ళించాలి. అందువల్లే బిసిసిఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికి క్రికెట్ ద్వారా ఆటగాళ్లు ఆదాయాన్ని పొందడం గొప్ప విషయమని” మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
In a historic move to celebrate consistency and champion outstanding performances in the #IPL, we are thrilled to introduce a match fee of INR 7.5 lakhs per game for our cricketers! A cricketer playing all league matches in a season will get Rs. 1.05 crores in addition to his…
— Jay Shah (@JayShah) September 28, 2024
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More