ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో భారత్ వెనకబడడానికి.. ఆస్ట్రేలియా ముందుకు సాగడానికి ఇద్దరు కారణం.. ఆస్ట్రేలియా కొత్త బ్యాట్స్ మెన్ పకోస్కో ఒకరైతే.. ఆయన రెండు క్యాచ్ లను నేలపాలు చేసి మన వికెట్ కీపర్ రిషబ్ పంత్ రెండోవ్యక్తి. ఈ ఇద్దరి వల్లే ఆట తారుమారైంది. ఆస్ట్రేలియా లీడ్ లో నిలవడానికి.. భారత్ వెనుకబడానికి మన పంత్ యే కారణం.
Also Read: ఫస్ట్ డే ఆస్ట్రేలియాదే..
ఇప్పటికే బ్యాటింగ్ లో రాణించలేకపోతున్న మన రిషబ్ పంత్ ఈరోజు ఆస్ట్రేలియాతో 3వ టెస్టులో అధ్వానమైన కీపింగ్ తో యువ ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ పకోస్కీ ఇచ్చిన రెండు క్యాచులు వదిలేసి విమర్శలపాలయ్యాడు. ఆ క్యాచులు పట్టి ఉంటే ఇప్పుడు మ్యాచ్ వేరే లెవల్లో ఉండేది.
సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో కీలకమైన టెస్టులో సిరీస్ 1-1తో సాగుతున్న వేళ రెండు జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. దేశవాళీలో అదరగొట్టిన విల్ పకోస్కీని ఆస్ట్రేలియా తీసుకుంది. అలాంటి పకోస్కీ రెండు సార్లు ఇచ్చిన క్యాచులను పంత్ నేలపాలు చేశాడు. ఫలితంగా ఆస్ల్రేలియా టాప్ ఆర్డర్ కకావికలం చేసే అవకాశం చేజారి ఆస్ట్రేలియా తొలిరోజు పటిష్ట స్థితిలో నిలిచి పైచేయి సాధించింది.
Also Read: విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి ఎసరు.. చిక్కుల్లో కెప్టెన్
ఒక అశ్విన్ బౌలింగ్ లో.. రెండోది సిరాజ్ బౌలింగ్ లో కూడా ఇలానే క్యాచ్ లు వదిలేశాడు. దీంతో అరంగేట్రం మ్యాచ్ లోనే పకోస్కీ అర్థశతకం సాధించి గట్టి పునాది వేశాడు. ఇప్పుడు భారత్ వెనుకబడడానికి పంత్ కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి.