https://oktelugu.com/

అఖిలప్రియ ఏపీలో అరెస్ట్ అయ్యింటే.. కథ వేరేగుండేది

టీడీపీ మాజీ మంత్రి అఖిలప్రియ తెలంగాణలో అరెస్ట్ కాబట్టి సరిపోయింది.. అదే ఏపీలో అరెస్ట్ అయ్యింటే.. కథ వేరేగుండేది. టీడీపీ అధినేత చంద్రబాబు , ఆయన పుత్రరత్నం లోకేష్ బాబులు ట్వీట్లు, వీధిపోరాటాలు, పరామర్శలు ఈ వారం అంతా రక్తి కట్టించేవారు. ఇక టీడీపీ మీడియా దీన్ని రచ్చ రంబోలా చేసి వదిలిపెట్టేది.. ఇదంతా మన సొంత వ్యాఖ్యానం కాదు.. వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తాజాగా ప్రెస్ మీట్ పెట్టి ఇదే పంచులు పేల్చాడు.. […]

Written By:
  • NARESH
  • , Updated On : January 8, 2021 7:20 pm
    Follow us on

    Akhila Priya Chandrababu

    టీడీపీ మాజీ మంత్రి అఖిలప్రియ తెలంగాణలో అరెస్ట్ కాబట్టి సరిపోయింది.. అదే ఏపీలో అరెస్ట్ అయ్యింటే.. కథ వేరేగుండేది. టీడీపీ అధినేత చంద్రబాబు , ఆయన పుత్రరత్నం లోకేష్ బాబులు ట్వీట్లు, వీధిపోరాటాలు, పరామర్శలు ఈ వారం అంతా రక్తి కట్టించేవారు. ఇక టీడీపీ మీడియా దీన్ని రచ్చ రంబోలా చేసి వదిలిపెట్టేది.. ఇదంతా మన సొంత వ్యాఖ్యానం కాదు.. వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తాజాగా ప్రెస్ మీట్ పెట్టి ఇదే పంచులు పేల్చాడు..

    Also Read: జగన్ ను లాజిక్ తో కొట్టిన పవన్ కళ్యాణ్

    ఏపీలో ఏది జరిగినా కూడా చంద్రబాబు అండ్ కో అధికార వైసీపీని వదలడం లేదు. ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ అయితే ఎంత రచ్చ చేశారో చూశాం.. అన్యాయంగా అరెస్ట్ చేశారని.. కక్షసాధింపులని ఆరోపించాడు. మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు అదే పనిచేశారు.

    తాజాగా అనంతపురం రెడ్డప్పలు జేసీ ఫ్యామిలీపై పగ సాధిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ విమర్శించారు. అంతేకాదు.. వారితో ఇప్పుడు అనంతపురంలో వీధిపోరాటాలు చేయిస్తూ జగన్ సర్కార్ పై దుమ్మెత్తి పోస్తున్నారు.

    Also Read: అది చంద్రబాబు కుట్రేనన్న బీజేపీ ఎంపీ

    ఇదే కనుక అఖిలప్రియ ఏపీలో అరెస్ట్ అయితే టీడీపీ దీన్ని అవకాశంగా అందిపుచ్చుకునేదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ పై కర్నూలులో కొన్ని భూదందాలు.. హత్యాయత్నం కేసులు నమోదు అయినా వైసీపీ ప్రభుత్వం పెద్దగా చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే అఖిలప్రియ అంతకుముందు వైసీపీలోనే ఉండి టీడీపీలోకి మారారు. ఇక కక్షసాధింపులు అంటారని వైసీపీ కూడా లైట్ గానే తీసుకుంది.

    కానీ తెలంగాణలో సీఎం కేసీఆర్ బంధువులనే కిడ్నాప్ చేయడంతో అటు కేసీఆర్ ఊరుకోలేదు.. ఇటు బలమైన తెలంగాణ పోలీసులు కూడా విడిచిపెట్టలేదు. మొత్తంగా ఏపీలో కనుక ఈ ఎపిసోడ్ జరిగితే తెలంగాణలో లాగా ప్రశాంతంగా అయితే ఉండేది కాదన్నది కాదనలేని వాస్తవం.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్