https://oktelugu.com/

టీపీసీసీ చీఫ్.. చావు కబురు చల్లగా చెప్పారు..

కాంగ్రెస్ లోని నేతలకు భూదేవి కంటే మించి ఓపిక ఉండాలి. లేదంటే వారి బుర్రలు బద్దలైపోతాయి. ఏదైనా ఒక నిర్ణయాన్ని కాంగ్రెసోళ్లు నాన్చినంతగా వేరే వాళ్లు నాన్చరంటే అతిశయోక్తి కాదేమో.. నాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి శ్రీకృష్ణ కమిటీ అంటూ సంవత్సరాల పాటు నాన్చినాన్చి చివరకు తప్పనిసరి పరిస్థితి ఎదురైతేనే ఇచ్చేశారు. ఇప్పుడు తెలంగాణ పీసీసీ ఎంపికను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించకుండా నేతల సహనానికి పరీక్ష పెడుతోంది. Also Read: ఉత్కంఠ: కేసీఆర్ ఆరోగ్యానికి అసలేమైంది? తాజాగా […]

Written By:
  • NARESH
  • , Updated On : January 8, 2021 7:24 pm
    Follow us on

    TPCC chief

    కాంగ్రెస్ లోని నేతలకు భూదేవి కంటే మించి ఓపిక ఉండాలి. లేదంటే వారి బుర్రలు బద్దలైపోతాయి. ఏదైనా ఒక నిర్ణయాన్ని కాంగ్రెసోళ్లు నాన్చినంతగా వేరే వాళ్లు నాన్చరంటే అతిశయోక్తి కాదేమో.. నాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి శ్రీకృష్ణ కమిటీ అంటూ సంవత్సరాల పాటు నాన్చినాన్చి చివరకు తప్పనిసరి పరిస్థితి ఎదురైతేనే ఇచ్చేశారు. ఇప్పుడు తెలంగాణ పీసీసీ ఎంపికను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించకుండా నేతల సహనానికి పరీక్ష పెడుతోంది.

    Also Read: ఉత్కంఠ: కేసీఆర్ ఆరోగ్యానికి అసలేమైంది?

    తాజాగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ చావుకబురును చల్లాగా చెప్పారు. ప్రస్తుతానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్ అని.. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ముగిసేవరకు కొత్త పీసీసీ చీఫ్ ను ఎన్నుకోవడం లేదని.. ఇది సోనియాగాంధీ నిర్ణయించారని బాంబు పేల్చారు.

    దీంతో పీసీసీ చీఫ్ పదవి వస్తే నాగార్జున సాగర్ లో ఊపేద్దాం.. గెలిపిద్దాం అని ఎదురుచూసిన ఆశావహులు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశలపై నీళ్లు చల్లినట్టైంది.

    Also Read: కేసీఆర్‌‌కు స్వల్ప అనారోగ్యం

    దీనికంతటికి కారణం జానారెడ్డి అన్న టాక్ కాంగ్రెస్ లో నడుస్తోంది. ఎందుకంటే నాగార్జునసాగర్ కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డినే. తాను సొంత క్రెడిట్ తో గెలిస్తే పీసీసీ కొత్త చీఫ్ దాన్ని తన ఖాతాలో వేసుకుంటాడని.. కాబట్టి ఉప ఎన్నిక జరిగే వరకు పీసీసీ చీఫ్ నియామకాన్ని చేపట్టవద్దని సూచించారు. ఒకవేళ గెలిస్తే జానారెడ్డినే పీసీసీ చీఫ్ కావచ్చని కలలుగంటున్నట్టు ఉన్నాడు. ఇప్పుడైతేనే అందరూ కలిసి పనిచేస్తారని.. లేదంటే నేతలంతా విడిపోతారని జానారెడ్డి ఈ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది..

    మొత్తానికి జానారెడ్డి గారు రాసిన లేఖనే ఇప్పుడు కొత్త పీసీసీ చీఫ్ ప్రకటనకు అడ్డుపుల్లలా పడిందన్న టాక్ కాంగ్రెస్ వర్గాల్లో నడుస్తోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్