Sri Lanka vs Afghanistan: నరాలు తెగిపోయే ఉత్కంఠ మ్యాచ్ లో శ్రీలంక ను చిత్తు చేసిన ఆఫ్గాన్…

నిన్న దంబుల్లా వేదికగా శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ల మధ్య జరిగిన మూడోవ మ్యాచ్ లో నరాలు తెగిపోయే ఉత్కంఠ రేకెత్తించడమే కాకుండా ఈ మ్యాచ్ ను హార్ట్ పేషెంట్స్ ఎవరైనా చూస్తే మాత్రం వాళ్లకు తప్పకుండా హార్ట్ ఎటాక్ వస్తుందేమో అనేంతలా ఉత్కంఠ ను కలిగించింది...

Written By: Gopi, Updated On : February 22, 2024 11:49 am
Follow us on

Sri Lanka vs Afghanistan: టి20 మ్యాచ్ లు అంటే చూసే అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించాలి. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనే ఒక సస్పెన్స్ ను క్రియేట్ చేస్తూ, నరాలు తెగిపోయేలా, రక్తం మరిగేలా మ్యాచ్ ను చూసే ప్రతి ప్రేక్షకుడు ఉద్వేగానికి లోనయ్యాలే ఒక మ్యాచ్ నడిచినప్పుడే దానిని చూసే ప్రేక్షకుడికిగాని, ఆ మ్యాచ్ ఆడే ప్లేయర్లకు గాని మంచి మజా వస్తుంది. అలాగే ఆ మ్యాచ్ ను గెలిపించిన ప్లేయర్లకు మంచి పేరు కూడా వస్తుంది.

దాదాపు చాలా రోజుల నుంచి టి20 మ్యాచ్ ల్లో అలాంటి మ్యాచ్ లను మనం మిస్ అవుతూ వస్తున్నాం.. కానీ నిన్న దంబుల్లా వేదికగా శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ల మధ్య జరిగిన మూడోవ మ్యాచ్ లో నరాలు తెగిపోయే ఉత్కంఠ రేకెత్తించడమే కాకుండా ఈ మ్యాచ్ ను హార్ట్ పేషెంట్స్ ఎవరైనా చూస్తే మాత్రం వాళ్లకు తప్పకుండా హార్ట్ ఎటాక్ వస్తుందేమో అనేంతలా ఉత్కంఠ ను కలిగించింది…అంతటి రసవత్తరమైన మ్యాచ్ లో శ్రీలంక మీద ఆఫ్గాన్ టీమ్ 3 పరుగుల తేడా తో విజయం సాధించింది…

ఇక ఈ మ్యాచ్ హైలెట్స్ ను కనక మనం ఒకసారి మనం చూసుకున్నటైతే….ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్ మెన్ లలో రెహమానుల్లా గుర్బాజ్ 70 పరుగులు చేయగా, హజాయి 45 పరుగులు చేశాడు… వీళ్ళకి తోడుగా హజ్మతుల్లా 31 పరుగులు చేశాడు. ఇక మొత్తానికైతే ఆఫ్గనిస్తాన్ టీం 20 ఓవర్లకి 209 పరుగుల భారీ స్కోరు అయితే చేయగలిగింది. ఇక 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక టీం ప్లేయర్లందరు తడబడ్డారు. అందులో మెండీస్ 65, నిస్సంక 60 పరుగులు చేసి ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసినప్పటికీ శ్రీలంక టీం విజయం మాత్రం సాధించలేకపోయింది. ఇక చివరి ఓవర్ లో శ్రీలంక విజయానికి 19 పరుగులు అవసరం అవ్వగా, ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ జద్రాన్ చివరి ఓవర్ ను వాఫ్ దార్ మముండ్ కి ఇచ్చాడు…

ఇక ఈయన వేసిన మొదటి బంతిని మెండీస్ ఫోర్ గా మలిచాడు. ఇక ఆ తర్వాత బంతిని వాఫ్ దార్ టైట్ గా వేయడం తో ఆ బంతి కి ఎలాంటి పరుగు రాలేదు. ఇక మూడోవ బంతిని మెండీస్ మళ్ళీ ఫోర్ గా మలిచాడు. ఇక నాల్గొవ బంతిని బౌలర్ డాట్ చేశాడు. ఇక ఐదోవ బంతికి సింగిల్ వచ్చేలా కనిపించిన కూడా మెండీస్ సింగిల్ తీసుకోలేదు. ఇక చివరి బంతికి 9 పరుగులు అవసరం అవ్వగా మెండీస్ చివరి బంతికి సిక్స్ కొట్టాడు.

దాంతో 3 పరుగుల తేడాతో ఆఫ్గనిస్తాన్ విజయం సాధించింది. మొత్తం మూడు టి 20 మ్యాచ్ ల్లో భాగంగా 2-1 తో శ్రీలంక కప్పు గెలిచినప్పటికి అఫ్గాన్ టీమ్ మాత్రం శ్రీలంక చేతిలో చివరి మ్యాచ్ గెలిచి వైట్ వాష్ అవ్వకుండా తనని తాను కాపాడుకోగలిగింది. ఇక ఆఫ్గాన్ చిన్న జట్టు అయినప్పటికీ ఆ టీమ్ శ్రీలంక కు చెమటలు పట్టించిందనే చెప్పాలి…