Viral Video : ఐసీసీ నిర్వహించే మ్యాచ్ లు రికార్డుల్లో భద్రంగా ఉంటాయి. అందులో ఎటువంటి సంఘటన చోటు చేసుకున్నా.. అది వెంటనే మీడియా ద్వారా బయటి ప్రపంచానికి తెలుస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ఐసీసీ నిర్వహించే మ్యాచ్ ల దగ్గర నుంచి మొదలుపెడితే కౌంటింగ్ క్రికెట్ మ్యాచ్ ల వరకు ప్రతి విషయం బయటి ప్రపంచానికి తెలుస్తూనే ఉంది.. దీనివల్ల క్రికెట్ చూసే వారి సంఖ్య పెరుగుతుంది. క్రికెట్ గురించి తెలుసుకోవాలనే వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.. సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లలో ఇరుజట్ల ఆటగాళ్లు విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తారు. హోరాహోరీగా పోరాడుతారు. బంతి, బ్యాట్ తో సరికొత్త ఆట తీరు ప్రదర్శిస్తుంటారు.. అలాంటి సంఘటనే ఇది. ఇంగ్లాండ్ దేశంలో ప్రస్తుతం కౌంటి క్రికెట్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమర్ సెట్ vs సర్రే జట్ల మధ్య ఓ మ్యాచ్ ఉత్కంఠను కలిగించింది. చివరి వరకు సాగిన ఈ మ్యాచ్ అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ ఆనందాన్ని అందించింది. ఈ సందర్భంగా మైదానంలో ఒక అద్భుతం ఆవిష్కృతం అయింది. కౌంటి ఛాంపియన్ షిప్ లో భాగంగా సోమర సెట్ 219 పరుగుల లక్ష్యాన్ని విధించింది.. దీనిని సర్రే టీం చేదించేందుకు రంగంలోకి దిగింది 9 వికెట్లకు 109 పరుగుల వద్ద నిలిచింది. ఇదే సమయంలో చివరి రోజు మ్యాచ్ మరో మూడు నిమిషాల్లో సమాప్తమవుతుంది అనుకుంటుండగా సోమర్ సెట్ ఆటగాళ్లు అద్భుతమైన ప్రణాళిక రూపొందించారు. ఎలాగైనా విజయం సాధించాలంటే వికెట్ దక్కించుకోవాలనే ఉద్దేశంతో బౌలర్, వికెట్ కీపర్ మాత్రమే కాకుండా మిగతా తొమ్మిది మంది ఫీల్డర్లను బ్యాటర్ పక్కనే ఫీల్డింగ్ చేయించింది.
బౌలర్ లీచ్ బంతిని వేశాడు. ఆ బంతిని స్ట్రైకర్ గా ఉన్న వార్రల్ తన బ్యాట్ తో ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ బంతి ప్యాడ్లను తాకింది. వెంటనే అంపైర్ అవుట్ అని ప్రకటించాడు. దీంతో 109 పరుగులకే సర్రే జట్టు కుప్పకూలింది. 111 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. ఈ క్రమంలో ఇద్దరు బ్యాటర్లతో కలిపి సోమర్ సెట్ కు చెందిన 11 మంది ఆటగాళ్లు ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. క్రికెట్ చరిత్రలో ఇటువంటి దృశ్యాలు అరుదుగా చోటు చేసుకుంటాయి. ఈ నేపథ్యంలో ఈ దృశ్యం సామాజిక మాధ్యమాలలో విస్తృతమైన వ్యాప్తిలో ఉంది. ఇక ఈ మ్యాచ్లో సోమర్ సెట్ ముందుగా బ్యాటింగ్ చేసి 317 రన్స్ చేసింది. అనంతరం సర్రే జట్టు కూడా ధాటిగానే బ్యాటింగ్ చేసింది. ఏకంగా 321 రన్స్ చేసి.. నాలుగు పరుగుల లీడ్ సాధించింది. రెండవ ఇన్నింగ్స్ లో సోమర్ సెట్ 224 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఆ టార్గెట్ ను చేదించే క్రమంలో 109 పరుగులకే కుప్పకూలింది.
❤️ Cricket ❤️#SOMvSUR#WeAreSomerset pic.twitter.com/S7IrAEMezz
— Somerset Cricket (@SomersetCCC) September 12, 2024