https://oktelugu.com/

Arvind Kejriwal: కేజ్రీవాల్‌ ఊపిరి పీల్చుకో.. సుప్రీంకోర్టు దయతో బతికిపోయాడు పో..

మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్‌ అయి.. ఆరు నెలలుగా తిహార్‌ జైల్లో ఉంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు విముక్తి లభించింది. సుప్రీం కోర్టు భారీ ఊరట కల్పించింది. బెయిల్‌ మంజూరు చేస్తూ శుక్రవారం(సెప్టెంబర్‌ 13న) కీలక ఆదేశాలు జారీ చేసింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : September 13, 2024 2:35 pm
    Arvind Kejriwal

    Arvind Kejriwal

    Follow us on

    Arvind Kejriwal: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోసం కేసులో మరో కీలక నేతకు ఊరట లభించింది. ఈ కేసు దేశ రాజధాని ఢిల్లీతోపాటు తెలుగు రాష్ట్రాల్లోనే ప్రధానంగా ప్రకంపనలు సృష్టించింది. ఢిల్లీ మద్యం కుంభకోణాని తెలుగు రాష్ట్రాల్లో మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్, వైసీపీ పార్టీలకు చెందిన కీలక నేతులు భాగస్వాములయ్యారు. ముఖ్యంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కూతురు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ కుంభకోణంలో కింగ్‌ పిన్‌ అని దర్యాప్తు సంస్థలు కోర్టులకు తెలిపాయి. పలు చార్జిషీట్లలో పేర్కొన్నాయి. ఈ కేసులో ఇప్పటి వరకు దర్యాప్తు సంస్థలు సుమారు 50 మందిని అరెస్టు చేశాయి. వీరిలో కవిత, మనీశ్‌ సిసోడియా, కేజ్రీవాల్, బుచ్చిబాబు లాంటి కొద్ది మంది మినహా మిగతా అందరూ అప్రూవర్‌గా మారారు. దీంతో వారికి ఇప్పటికే బెయిల్‌ వచ్చింది. సిసోడియా అప్రూవర్‌గా మారకపోవడంతో దాదాపు 16 నెలలు జైల్లో ఉన్నారు. కవిత, కేంజ్రీవాల్‌ ఐదారు నెలలు జైల్లో ఉన్నారు. గత నెలలో కవితకు సుప్రీం కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. తాజాగా కేజ్రీవాల్‌కు కూడా విముక్తి కల్పించింది.

    కీలక ఆదేశాలు..
    కేజ్రీవాల్‌ బెయిల్‌ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈడీ కేసులో ఇప్పటికే బెయిల్‌ లభించింది. అయితే సీబీఐ కేసులో బెయిల్‌ రాకోవడంతో జైల్లోనే ఉన్నారు. శుక్రవారం(సెప్టెంబర్‌ 13న) విచారణ జరిపిన ఇద్దరు జడ్జిల ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. షరతులతో బెయిల్‌ మంజూరు చేసింది. రూ.10 లక్షల పూచీకత్తుతోపాటు ఇద్దరు సెక్యూరిటీ సంతకాలు చేయాలని స్పష్టం చేసింది. ట్రయల్‌ కోర్టుకు విచారణకు హాజరు కావాలని సూచించింది. సాక్ష్యాలను టాంపర్‌ చేయకూడదని షరతులు విధించింది. దీంతో దాదాపు ఐదున్నర నెలల తర్వాత ఆయన తిహార్‌ జైలు నుంచి విడుదల కాబోతున్నారు.

    లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనుమతి తప్పనిసరి..
    ఇక మరో కీలక నిబంధన ఏమిటంటే.. ఢిల్లీ లెప్టినెంట్‌ గవర్నర్‌ వీకే. సక్సేనా అనుమతి లేకుండా ముఖ్యమంత్రి కార్యాలయానికి లేదా ఢిల్లీ సెక్రటేరియేట్‌కు వెళ్లకూడదని ఆదేశించింది. అంతేకాదు.. గరవ్నర్‌ అనుమతి తీసుకున్నాకే ప్రభుత్వ ఫైళ్లపై సంతకం చేయాలని కూడా షరతు విధించింది. ఇక ఈ కేసుపై ఎలాంటి ప్రకటనలు చేయకూడాదని తెలిపింది. సాక్షులతో మాట్లాడొద్దని పేర్కొంది.

    జడ్జి కీలక వ్యాఖ్యలు..
    బెయిల్‌ ఆదేశాల సందర్భంగా జడ్జి ఉజ్జల్‌ భుయాన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్‌ అరెస్టు అక్రమం కాదని తెలిపారు. న్యాయ ప్రక్రియలో సుదీర్ఘ కారాగారవాసం అంటే స్వేచ్ఛను హరించడమే అని బెయిల్‌ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్, జస్టిస్‌ సూర్యకాంత్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం బెయిల్‌ మంజూరు చేసింది. ఎట్టకేలకు సుప్రీం కోర్టు చొరవతో బెయిల్‌ రావడంతో సాయంత్రం జైలు నుంచి విడుదల కానున్నారు.