Vishwavasunama Samvathsaram : 2025 మార్చి 30తో విశ్వావసునామ సంవత్సరం ప్రారంభమైంది. ఉగాది సందర్భంగా కొత్త పంచాంగం ఆవిష్కరణతో ఈ ఏడాది ఎలా ఉందో తెలుసుకోవాలని చాలామంది ఈరోజు సాయంత్రం పంచాంగ శ్రవణం చేశారు. అయితే కొందరు తమ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. మరికొందరు శుభకార్యాలు నిర్వహించుకోవాలని అనుకునేవారు ఈ ఏడాదిలో మంచి రోజులు ఎలా ఉన్నాయో పండితులు చెప్పారు. అయితే ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏవో తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. ఎందుకంటే కొందరు కొత్తగా వ్యాపారం చేయాలని అనుకునేవారు.. విహారయాత్రలకు వెళ్లాలని అనుకునేవారు.. ముఖ్యమైన ప్రదేశాలను సందర్శించాలని ప్లానింగ్ చేసుకునే వారికి ఈ తేదీలు ఉపయోగపడతాయి. అయితే కొత్త పంచాంగం ప్రకారం ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీలో వస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read : విశ్వావసునామ సంవత్సరంలో శుభ ముహూర్తాలు ఇవే..
కొత్త పంచాంగం ప్రారంభమైన తర్వాత ఏప్రిల్ నెలలో వస్తున్న ముఖ్యమైన పండుగ శ్రీరామనవమి. ఈ పండుగా రోజు సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తారు. అలాగే శ్రీరాముడికి పట్టాభిషేకం నిర్వహిస్తారు. ఏడాది శ్రీరామనవమిని ఏప్రిల్ 6 నిర్వహించనున్నారు. శ్రీరామనవమితో కొన్ని రోజులపాటు పండుగలు లేవు. అంటే మే, జూన్ లలో వేసవికాలం ఉండడంతో.. ఈ నెలలో శుభకార్యాలు కూడా తక్కువగానే నిర్వహిస్తారు. అయితే జులై 6న తొలి ఏకాదశి పండుగ నిర్వహించుకోనున్నారు. ఈ ఏకాదశి తోనే వర్షాలు ప్రారంభమవుతాయని కొందరు భావిస్తారు. తొలి ఏకాదశి తో పండుగలు ప్రారంభమవుతాయని చెబుతారు. జూలై నెలలోనే 10 తేదీన గురు పౌర్ణమి నిర్వహించుకోనున్నారు. ఈ సమయంలో ఆషాడమాసం ఉన్నందున ఇతర కార్యక్రమాల నిర్వహించరు. అయితే జూలై 25న శ్రావణమాసంతో మళ్లీ పండుగలు ప్రారంభం కానున్నాయి.
ఆగస్టు 8 న వరలక్ష్మి వ్రతం నిర్వహించుకోనున్నారు. ఈరోజు మహిళలు ప్రత్యేకంగా లక్ష్మీదేవిని పూజించి వ్రతం నిర్వహిస్తారు. ఆ తర్వాత రోజే 9న రాఖీ పౌర్ణమి నిర్వహించనున్నారు. అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రత్యేకగా నిలిచే రాఖీ పౌర్ణమి వేడుకను నిర్వహిస్తారు. ఇదే నెలలో 16న కృష్ణాష్టమి నిర్వహిస్తారు. ఈరోజు శ్రీకృష్ణుడి కి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
వారం రోజులపాటు ఉత్సవాలు జరిగే వినాయక చవితి ఆగస్టు 27న ప్రారంభం కాబోతోంది. దేశవ్యాప్తంగా తొమ్మిది రోజులపాటు వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత అక్టోబర్ 2న తెలంగాణలో ప్రత్యేకంగా నిర్వహించే విజయదశమి రాబోతుంది. ఇదే నెలలో 20వ తేదీన దీపావళి పర్వదినం ఉండనుంది. దీపావళి తర్వాత అమావాస్య తెల్లారి నుంచి కార్తీక మాసం ప్రారంభం కాబోతోంది. నెల రోజులపాటు ఉండే కార్తీకమాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు.
దీపావళి తర్వాత ప్రధాన పండుగలైన జనవరి 14న భోగి, 15న సంక్రాంతి పండుగ నిర్వహించుకోనున్నారు. మే నెలలో 23న వసంత పంచమి, ఫిబ్రవరి 15న మహాశివరాత్రి రానుంది. అలాగే మార్చి 2న హోలీ పండుగ నిర్వహించుకోనున్నారు. అయితే ఈ ఏడాది జనవరి 30న మేడారం జాతర కూడా ప్రారంభం కానుంది. దేశ విదేశాల నుంచి జాతరకు తరలివరానున్నారు.