Zodiac Signs : ప్రతి ఒక్కరి జాతకంలో గురు బలం తప్పనిసరిగా ఉండాలి. గురు బలం ఉంటేనే కొన్ని పనులు సులువుగా పూర్తి చేయగలుగుతారు. కొందరికి వివాహాలు కావాలంటే గురు బలం ఉండాలని అంటారు. అలాంటి గురువుగా పిలిచే బృహస్పతి గ్రహం ఒక్కో రాశి నుంచి మరో రాశికి ప్రవేశిస్తూ ఉంటుంది. ఈ గ్రహం అన్ని గ్రహాలకు అధిపతిగా ఉంటూ జాతకంలో అనేక మార్పులను తీసుకువస్తూ ఉంటుంది. వచ్చే మే నెలలో బృహస్పతి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సందర్భంగా మూడురాశుల వారికి అదృష్టం లక్కలా పట్టుకొని ఉంది. వారు ఏ పని మొదలుపెట్టిన పూర్తి చేయడానికి సమయం ఆసన్నమైంది. ఇంతకీ మూడు రాశులు ఏవో ఎప్పుడు చూద్దాం..
Also Read : ఈ రాశులంటే శని దేవుడికి బాగా ఇష్టం.. ఇందులో మీ రాశి ఉందా?
బృహస్పతి ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్నాడు మే నెలలో మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సందర్భంగా వృషభ రాశి వారికి కూడా ప్రభావం పడనుంది. వృషభ రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించిన గురు బలం ఈ రాశి వారికి కచ్చితంగా ఉంటుంది. వీరు కొత్తగా ఏ పనులు చేపట్టిన విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సివస్తుంది. ఈ ప్రయాణాల ద్వారా లాభాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి సంతోషంగా జీవించగలుగుతారు. వ్యాపారిలో కొత్తగా ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంటుంది.
మే నెల నుంచి తులారాశి వారికి గురు బలం ఎక్కువగా ఉంటుంది. మీరు ఈ నెలలో పట్టిందల్లా బంగారమే అవుతుంది. జీవితంలో ఇప్పటివరకు అనుకున్న పనులను ఈ నెలలో పూర్తి చేయగలుగుతారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. పెద్దల సలహా వీరికి ఉండడంతో మీరు పెట్టే పెట్టుబడులు అధిక లాభాలను ఇస్తాయి. జీవిత భాగస్వామి కోసం కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. విహారయాత్రలకు వెళ్లడానికి ప్లాన్ చేస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అయితే ఇవి లాభంగానే ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధించగలుగుతారు.
బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించడంతో ఈ రాశి వారికి అనేక లాభాలు జరగనున్నాయి. గతంలో కంటే ఈ రాశి వారి ఆదాయం ఇప్పుడు పెరుగుతుంది. ఉద్యోగులు పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది. వీరికి అధికారుల నుంచి ఉండే ఒత్తిడి తొలగిపోతుంది. కొత్తగా బాధ్యతలు చేపట్టగలుగుతారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. అయితే వారితో ఆర్థిక వ్యవహారాలు జరిపేందుకు కోస్తా ఆలోచించాలి. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విదేశాల నుంచి శుభవార్తలు వింటారు. పిల్లల భవిష్యత్తు కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
అయితే పై మూడు రాశులు మాత్రమే కాకుండా మిగతా రాశుల వారికి కూడా గురు బలం ఉండే అవకాశం ఉంది. అయితే గురు బలం కారణంగా పై మూడు రాశుల వారు మాత్రం అధిక లాభాలు పొందుతారు. మిగతావారు కొన్ని రోజులపాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది.