Bollywood Heroine : ఈమె చేసిన తొలి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. కానీ ఈ హీరోయిన్ తన నటనతో ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ సరైన బ్రేక్ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తుంది. ఈమె తల్లి కూడా ఒకప్పుడు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. ఈమె అక్క కూడా తెలుగుతోపాటు హిందీలో కూడా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. సినిమా ఇండస్ట్రీలోకి ఈ మధ్యకాలంలో ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరోయిన్లలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ కూడా ఒకరు. ఈ బ్యూటీ సెలబ్రిటీ ఫ్యామిలీ నుంచి సినిమా ఇండస్ట్రీ లోకి అడిగి పెట్టింది. ప్రస్తుతం సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది. ఈమె తల్లి కూడా ఒకప్పుడు స్టార్ హీరోయిన్. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో తన అక్క వరుసగా సినిమాలతో దూసుకుపోతుంది. ఈమె బాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఖుషి కపూర్. ఒకప్పటి స్టార్ హీరోయిన్ అతిలోకసుందరి శ్రీదేవి చిన్న కూతురు మరియు జాన్వి కపూర్ చెల్లెలు ఖుషి కపూర్. ఈ మధ్యకాలంలోనే ఖుషి కపూర్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
Also Read : తెలుగులో చేసిన ఒకే ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. క్రేజ్ మాత్రం ఓ రేంజ్ లో.. ఈ బ్యూటీ ఎవరంటే..
ఇప్పటికే తన అక్క జాన్వి కపూర్ తెలుగుతోపాటు హిందీలో కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. జాన్వి కపూర్ దేవర సినిమాతో టాలీవుడ్ సినిమా ప్రేక్షకులకు పరిచయం అయ్యి మంచి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం జాహ్నవి కపూర్ తెలుగులో రామ్ చరణ్ ,బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న పెద్ది సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అక్క బాటలోనే ఖుషి కపూర్ కూడా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మధ్యకాలంలో వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఖుషి కపూర్. కానీ ఈమె నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయాయి. దాంతో ఖుషి కపూర్ కు అనుకున్నంత క్రేజ్ రాలేదు. కానీ ఆమె మాత్రం తన కెరియర్ పై నమ్మకంతో ముందుకు అడుగులు వేస్తుంది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఖుషి కపూర్ తన స్కూల్ డేస్ గురించి చెప్పుకొచ్చింది. స్కూల్ చదువుతున్న రోజుల్లో తాను డి గ్లామర్ గా ఉండటం వలన చాలామంది తనను ఎగతాళి చేసేవారు అని, చాలామందికి సంబంధించిన ప్రేమలేఖలను తాను ఇచ్చేదని, ప్రేమికుల మధ్య తనను వారధిగా వాడుకున్న సందర్భాలు చాలా ఉన్నాయని ఆ ఇంటర్వ్యూలో ఖుషి కపూర్ చెప్పుకొచ్చింది. కానీ తాను ఎవరి మాటలను కూడా పట్టించుకునే దాన్ని కాదని తెలిపింది. ఇప్పటివరకు ఈమెయిల్ నటించిన సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర మిశ్రమ ఫలితాలు అందుకున్నాయి. ఈ క్రమంలో ఖుషి కపూర్ తన తర్వాతి సినిమా మీద గట్టిగానే ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.
View this post on Instagram