YS Sharmila : ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ను( Pawan Kalyan) జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడు అంటూ సంబోధిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని దత్తపుత్రుడు అని చెబుతున్నారు కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల. గత ఐదేళ్లుగా వైయస్ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దాడికి దిగే వారు. ఆయన వైవాహిక జీవితం పై తరచూ మాట్లాడేవారు. పైగా చంద్రబాబుకు దత్త పుత్రుడు అని పలుమార్లు విమర్శలు చేసేవారు. కానీ ఇప్పుడు అదే విమర్శను ఎదుర్కొంటున్నారు జగన్మోహన్ రెడ్డి. సొంత సోదరి బిజెపికి జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడని ఆరోపిస్తుండడం విశేషం.
* తరచూ వైయస్సార్ కాంగ్రెస్ పై విమర్శలు
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను( Alliance government failures ) ప్రశ్నించకుండా.. షర్మిల తరచూ తమని నిలదీస్తుండడాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తప్పు పడుతున్నాయి. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతోందని.. ఎన్నెన్నో ప్రభుత్వ వైఫల్యాలు వెలుగు చూస్తుంటే షర్మిల కనీసం విమర్శలు చేయడం లేదని.. ఇంట్లో ఉండి సోషల్ మీడియా పోస్టులకు మాత్రమే పరిమితం అవుతున్నారంటూ ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. దీనిపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు షర్మిల. గత ఐదు సంవత్సరాల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో పందికొక్కుల్లా ప్రజాధనాన్ని తినేసారంటూ సంచలన ఆరోపణలు చేశారు. అంతటితో ఆగకుండా బిజెపికి జగన్మోహన్ రెడ్డి దత్త పుత్రుడు అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం షర్మిల కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు.
* వ్యతిరేక కూటమి
వాస్తవానికి కాంగ్రెస్( Congress) పార్టీ చీఫ్ గా షర్మిల ఉన్నారు. ఆ పార్టీ జాతీయస్థాయిలో ఇండియా కూటమిలో ఉంది. ఏపీకి సంబంధించి వామపక్షాలతో పాటు కాంగ్రెస్ ఇండియా కూటమిలో ఉన్నాయి. బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం, జనసేన లు ఉన్నాయి. ఈ లెక్కన కాంగ్రెస్ పార్టీ టిడిపి కూటమికి వ్యతిరేకంగా గళం ఎత్తాలి. కానీ ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మాత్రం కూటమికంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పైనే ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రశ్నిస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. టిడిపి కూటమికి ఎందుకు విమర్శించడం లేదని నిలదీస్తున్నారు. తెర వెనుక కూటమితో షర్మిలకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. దీనిపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు షర్మిల.
* గత ఐదేళ్లపాటు స్నేహం
గత ఐదేళ్లుగా బిజెపితో( BJP) మంచి సంబంధాలు కొనసాగించేవారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎన్డీఏలో టిడిపి చేరిన తర్వాత కూడా.. అదే ఎన్ డి ఏ కు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా వెళ్లడం లేదు. అటు కేంద్రం సైతం జగన్మోహన్ రెడ్డి విషయంలో పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆయనపై ఎటువంటి పాత కేసులను తెరపైకి తేవడం లేదు. అందుకే తనపై విమర్శలు చేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై విరుచుకుపడుతున్నారు షర్మిల. ఇప్పటికీ బీజేపీతో స్నేహంతో ఉన్నారని.. జగన్మోహన్ రెడ్డి బిజెపికి నిజమైన దత్తపుత్రుడు అంటూ ఆరోపణలు చేస్తున్నారు షర్మిల. దీంతో ఇదో వైరల్ అంశంగా మారిపోయింది.