Homeఆధ్యాత్మికంYS Jagan: ఆ 70 వేల మంది వాలంటీర్లకు జగన్ నో ఛాన్స్

YS Jagan: ఆ 70 వేల మంది వాలంటీర్లకు జగన్ నో ఛాన్స్

YS Jagan: వాలంటీర్ల విషయంలో జగన్ వ్యూహం మారిందా? వారిపై దెబ్బ పడటం ఖాయమా? వారందరినీ కొనసాగించే ఛాన్స్ లేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వాస్తవానికి ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఒక సంచలనమే. జగన్ రాజకీయంగా సక్సెస్ కావడానికి, ప్రజలతో మమేకం కావడానికి, పథకాలతో చేరువ కావడానికి ముమ్మాటికీ వలంటీర్లే కారణం. అయితే ఈ వలంటీర్ వ్యవస్థ ఆర్థిక భారమైనా జగన్ మాత్రం కొనసాగించారు. సొంత పార్టీ నేతల కంటే వలంటీర్లకి కీలక అధికారాలు ఇచ్చారు. అందుకే ఈ వ్యవస్థ ఇప్పుడు ఏపీలో కీలకంగా మారింది.

వాస్తవానికి వాలంటీర్ల వ్యవస్థను విపక్షాలు వ్యతిరేకించాయి. చివరకు అదే వ్యవస్థను సమర్థించాల్సి వచ్చింది. ఈసారి టిడిపి అధికారంలోకి వస్తే వాలంటీర్లకు జీతాలను ఐదు వేల నుంచి పదివేలకు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ఈ హామీ అమలవుతుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే.. వాలంటీర్ వ్యవస్థ కీలకమని అన్ని పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చాయి. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో సంక్షేమ పథకాల అమలు బాధ్యత నుంచి వాలంటీర్లను తప్పించారు.అయితే దీని వెనుక టిడిపి ఫిర్యాదులు ఉన్నాయని.. అందుకే రాజీనామాలు చేయాలని వైసిపి కోరడంతో వలంటీర్లు రాజీనామా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 70 వేల మందికి పైగా వాలంటీర్లు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అయితే వీరందరికీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం తిరిగి ఉద్యోగాలు వస్తాయని వైసీపీ నేతలు చెబుతున్నారు.

అయితే తాజాగా సీఎం జగన్ చేసిన ప్రకటన చూస్తే వీరికి ఉద్యోగాలు వచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఇప్పటివరకు వాలంటీర్లు ప్రతి 50 కుటుంబాల బాధ్యతను చూసేవారు. ఇకనుంచి ప్రతి 70 కుటుంబాలకు వాలంటీర్లను నియమిస్తామని జగన్ తాజాగా ప్రకటించారు. ఈ లెక్కన వాలంటీర్ల సంఖ్య తగ్గుముఖం పట్టనుంది. మరో 20 ఇళ్లు అదనంగా బాధ్యతలు చూడాల్సి ఉండడంతో.. చాలామంది వాలంటీర్ల అవసరం ఉండదు. అందుకే ఇప్పుడు రాజీనామా చేసిన ఆ 70 వేలమంది వాలంటీర్లను విధుల్లోకి తీసుకునే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ప్రస్తుతం జగన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రాజీనామా చేసిన వాలంటీర్లలో ఆందోళన రేపుతున్నాయి. అయితే వైసిపి నేతల ఆదేశాలతోనే తాము రాజీనామా చేశామని.. తమకు అన్యాయం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వైసిపి నేతల దేనని వాలంటీర్లు కోరుతున్నారు. మొత్తానికి అయితే జగన్ తాజా ప్రకటనతో వాలంటీర్లలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version