https://oktelugu.com/

Smartphone Tips: మీ మొబైల్ స్పీకర్ లోకి వాటర్ వెళ్లాయా? ఇలా చేయండి..

మీ ఫోన్ స్పీకర్ లోకి వాటర్ పోతే వెంటనే ఆ ఫోన్ లో నుంచి గూగుల్ ఓపెన్ చేయండి. సెర్చ్ బార్ లో ఫిక్స్ మై స్పీకర్ అని టైప్ చేయండి. ఫస్ట్ వచ్చిన వెబ్ సైట్ మీద క్లిక్ చేయాలి.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : April 30, 2024 1:20 pm
    Smartphone Tips

    Smartphone Tips

    Follow us on

    Smartphone Tips: ఒకప్పుడు చాలా తక్కువ మంది ఇంట్లో మాత్రమే ఫోన్ ఉండేది.అది కూడా ల్యాండ్ లైన్ ఫోన్ ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఫోన్ కాదు ఫోన్లు ఉంటున్నాయి. ఇంట్లో ఎందరు ఉంటే అన్ని ఫోన్లు ఉంటున్నాయి. చిన్న పిల్లల వద్ద కూడా ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉంటుంది. ఇక ఇప్పుడు ఎక్కువ క్వాలిటీతో ఫోన్ లు రావడం లేదు. చాలా తొందరగానే రిపేర్ కు వస్తున్నాయి. అయితే ఫోన్ లను ఉపయోగిస్తున్నప్పుడు అనుకోకుండా నీటి వద్ద ఉండటం. ఫోన్ లోకి నీరు పోవడం వంటివి జరుగుతున్నాయి.

    మరి మీ మొబైల్ మొత్తంలోకి వాటర్ పోతే సెల్ పాయింట్ కు తీసుకెళ్లాల్సిందే. కానీ స్పీకర్లో వాటర్ పోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీ ఫోన్ సేఫ్ అవుతుంది. ఇంతకీ స్పీకర్ లోకి వాటర్ పోతే ఏం చేయాలి అంటే..అనుకోకుండానే మొబైల్ ఫోన్ స్పీకర్ లోకి వాటర్ పోతే ఆడియో వినబడక పోవడం, లేదా ఫోన్ పాడవటం వంటివి జరుగుతాయి. అప్పుడు ఏం చేయాలో ఎవరికి తోచదు. అందుకే మీ కోసం ఓ టిప్ చెబుతాను పాటించండి.

    మీ ఫోన్ స్పీకర్ లోకి వాటర్ పోతే వెంటనే ఆ ఫోన్ లో నుంచి గూగుల్ ఓపెన్ చేయండి. సెర్చ్ బార్ లో ఫిక్స్ మై స్పీకర్ అని టైప్ చేయండి. ఫస్ట్ వచ్చిన వెబ్ సైట్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీకు స్పీకర్ సింబల్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు వెంటనే బజర్ సౌండ్ వచ్చేస్తుంది. దీంతో ఒక్కసారిగా మీ మొబైల్ స్పీకర్ లోకి వెళ్లిన వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి.

    ఇలా చేసిన తర్వాత అందులోని వాటర్ పోతాయి. కాబట్టి మీకు ఆడియో ప్రాబ్లం కూడా ఉండదు. మొబైల్ లోకి వెళ్లిన వాటర్ కూడా బయటకు వచ్చేస్తాయి కాబట్టి మీ మొబైల్ సేఫ్. మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నారు. మీ మొబైల్ లోకి వాటర్ పోతే ఎప్పుడైనా ఇదే విధంగా ఫాలో అవండి.