Spiritual Tips: సకల శుభాలకు, ఐశ్వర్యానికి, ధన ప్రాప్తికి లక్ష్మీదేవినే కారణం. ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటే ఇల్లు ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. ఎప్పుడు విజయాలు చేకూరుతాయి. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే ఆ దేవతకు ఇష్టమైన పనులు చేయాలి. ప్రతి ఇంట్లో పరిశుభ్రం, స్వచ్ఛమైన మనసులు ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుందని పురాణాలు చెబుతుంటాయి. అంతేకాకుండా లక్ష్మీదేవి ఎప్పుడు సింహద్వారం నుంచి ఇంట్లోకి వస్తుందని చెబుతారు. అయితే రాత్రి సమయంలో సింహద్వారం తెరిచే ఉండాలని.. వెనుక వైపు ఉన్న డోరు మూసి ఉంచాలని అంటారు. అలా ఎందుకు చెబుతారు? వెనక డోర్ నుంచి ఎవరు వస్తారు?
సువర్ణపురం అనే పట్టణంలో విశ్వేశ్వర కర్మ అనే పండితుడు ఉండేవారు. ఆయన ఎంతో కష్టపడి బంగారు ఆభరణాలు, ముత్యాలు, ధనం సంపాదించాడు. అయితే ఆయన ఎప్పుడూ రాత్రి సమయంలో ఇంటికి వెనుక వైపు ఉన్న డోర్ ను తెరిచే ఉంచుతున్నాడు. విశ్వేశ్వర కర్మ భార్య లక్ష్మీ భక్తురాలు. పూజలు, వ్రతాలు చేస్తూ నిత్యం దైవచింతలలో ఉండగలుగుతారు. అయితే ఒకరోజు విశ్వేశ్వర కర్మ భార్య కలలోకి లక్ష్మీ వచ్చి.. అమ్మ నీ భర్త మీ ఇంటి వెనుక వైపు ద్వారాన్ని తెరిచే ఉంచుతున్నాడు.. అలా చేయడం వల్ల నేను మీ ఇంట్లోకి రాలేకపోతున్నాను.. మా అక్క జేష్ఠ దేవత అటువైపు నుంచి వస్తుంది. అందువల్ల రాత్రి సమయంలో వెనుక వైపు తలుపులు మూసి ఉంచాలని తెలుపుతుంది.. వరుసటి రోజు ఉదయం విశ్వేశ్వర కర్మకు తన భార్య ఈ విషయం చెప్పగా… నవ్వి ఊరుకుంటాడు. కానీ కొన్ని రోజుల తర్వాత వారింట్లో దొంగలు పడి బంగారం ఎత్తుకెళ్లి పోతారు. ఇంట్లో అశాంతి నెలకొంటుంది. ఇది గమనించిన విశ్వేశ్వర కర్మ అసలు విషయం తెలుసుకొని.. లక్ష్మీదేవిని ఆరాధిస్తాడు. అప్పటినుంచి రాత్రి సమయంలో ఇంటి వెనక తలుపు మూసి ఉంచి.. సింహ ద్వారాన్ని తెరిచే ఉంచాడు.
సింహద్వారం తెరిచి ఉంచడం వల్ల ఇంట్లోకి కాంతి ప్రసరిస్తుంది. దీంతో ఇల్లు మొత్తం పరిశుభ్రంగా ఉంటుంది. లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే ఎంతో ఇష్టం. అందుకే ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అంటారు. అలాగే లక్ష్మీదేవి అక్క అయిన జ్యేష్ఠ దేవత ఇంటి వెనుక వైపు నుంచి వస్తుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో ఇంటి వెనక ద్వారం తెరిచి ఉండడంవల్ల ఇంట్లోకి ప్రవేశించి నష్టాలను కలిగిస్తుంది. జ్యేష్ఠ దేవత ఇంట్లో ఉండడం వల్ల ఇల్లు ఎప్పుడు అపరిశుభ్రంగా ఉంటుంది. అశాంతి నెలకొంటుంది. దొంగలు పడతారు.
అందువల్ల రాత్రి సమయంలో సింహద్వారం తెరిచి ఉంచాలి. వెనుక వైపు డోర్ ను మూసి ఉంచాలని పండితులు చెబుతున్నారు. ప్రతిరోజు ఇలా ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.