https://oktelugu.com/

Maha Shivaratri : మహా శివరాత్రి రోజు.. ఇలా శివుడిని పూజిస్తే బాధలన్నీ దూరం

మహా శివరాత్రి అనేది చాలా ప్రత్యేకమైన రోజు. ఇలాంటి ప్రత్యేకమైన రోజు శివుడిని సరైన పద్ధతిలో పూజిస్తే తప్పకుండా బాధలన్నీ తొలగిపోయి.. సంతోషం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అయితే పవిత్రమైన ఈ మహా శివరాత్రి నాడు శివుడిని ఎలా పూజిస్తే ఫలితం ఉంటుందో మరి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By: , Updated On : February 21, 2025 / 03:09 PM IST
Maha Shivaratri

Maha Shivaratri

Follow us on

Maha Shivaratri : హిందూ మతంలో శివుడిని భక్తులు ఎంతో పవిత్రంగా కొలుస్తారు. సాధారణంగా సోమవారం, శనివారాల్లో అభిషేకంతో శివుడిని మైమరిపిస్తారు. శివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం. కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరాలంటే తప్పకుండా శివునికి అభిషేకం చేయాలని పండితులు చెబుతుంటారు. అయితే శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన మహా శివరాత్రి వచ్చేస్తుంది. ఫిబ్రవరి 26వ తేదీన దేశ వ్యాప్తంగా శివుడిని ఎంతో భక్తితో పూజిస్తారు. అభిషేకాలు, ఉపవాసం వంటివి ఆచరించి పాపాల నుంచి విముక్తి పొందుతారు. అయితే మహా శివరాత్రి అనేది చాలా ప్రత్యేకమైన రోజు. ఇలాంటి ప్రత్యేకమైన రోజు శివుడిని సరైన పద్ధతిలో పూజిస్తే తప్పకుండా బాధలన్నీ తొలగిపోయి.. సంతోషం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అయితే పవిత్రమైన ఈ మహా శివరాత్రి నాడు శివుడిని ఎలా పూజిస్తే ఫలితం ఉంటుందో మరి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మహా శివరాత్రి చాలా పవిత్రమైనది. ఈ మహా శివరాత్రి నాడు ఉదయాన్నే అనగా బ్రహ్మ ముహుర్తంలో లేవాలి. లేచి స్నానం ఆచరించి శుభ్రమైన సంప్రదాయ దుస్తులు ధరించాలి. ముఖ్యంగా తెల్లని దుస్తులను ధరించండి. ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసి ఆ వేకువ జామున సమయంలో ఆలయాన్ని సందర్శించండి. శివుడికి మొదటి అభిషేకం చేయండి. పాలు, పెరుగు, పంచదార, కొబ్బరి నీళ్లు, మంచి నీళ్లతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత బిల్వ పత్రాలు, తెల్ల జిల్లేడు పువ్వులు దేవునికి సమర్పించి.. నైవేద్యం పెట్టాలి. ఆ తర్వాత ధూపం వేయాలి. ఇలా పూజ మొత్తం అయిపోయిన తర్వాత శివ పంచాక్షరి మంత్రాన్ని భక్తితో చదవాలి. ఆ తర్వాత కొంత సమయం పాటు శివుడిని తలచుకుని ధ్యానం చేయాలి. మనస్సులో ఎలాంటి ఆలోచనలు లేకుండా కేవలం శివుడిని మాత్రమే మనస్సులో తలచుకుని ధ్యానిస్తే.. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి ఆందోళనలు, ఒత్తిడి ఉన్నా కూడా తగ్గిపోతుంది. ఎలాంటి భయాలు మనస్సులో లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటారు. అయితే ఎలాంటి చెడు ఆలోచనలు రాకుండా చాలా ప్రశాంతంగా కేవలం శివుడిని మాత్రమే ధ్యానించాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. లేకపోతే మీరు ఎంత భక్తితో పూజ చేసినా ఫలితం ఉండదు.

మహా శివరాత్రి రోజే కాకుండా ఎప్పుడైనా కూడా శివుడిని ప్రదోష సమయంలో పూజిస్తేనే మంచి ఫలితం ఉంటుంది. ప్రదోష సమయం అంటే సాయంత్రం 6 గంటలు. అంటే డైలీ ఇదే కాకుండా రోజుకి ఒక సమయం ప్రదోష సమయం అని ఉంటుంది. ఈ సమయంలో శివుడిని దర్శించుకుని అభిషేకం చేస్తే పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఉదయం సమయంలో అభిషేకం చేసిన దాని కంటే ప్రదోష సమయంలో అభిషేకం చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుందని పండితులు అంటున్నారు. ఈ సమయంలో ఇంకా రుద్రాభిషేకం చేస్తే పాపాలు అన్ని కూడా తొలగిపోయి అంతా మంచే జరుగుతుందని అంటున్నారు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. పూర్తి వివరాలు కోసం పండితులను సంప్రదించగలరు.