Vinayaka chavithi 2024 : అన్ని విజ్ఞాలను తొలగించే వినాయకుని పూజకి ఇంకా ఎంత సమయం లేదు. దేశ వ్యాప్తంగా వినాయకుని పూజని అందరూ ఘనంగా జరుపుకుంటారు. ఎలాంటి విజ్ఞాలు లేకుండా అన్ని పనులు మంచిగా జరగాలని భక్తి శ్రద్ధలతో గణపతిని పూజిస్తారు. ప్రతి ఏడాది భద్రపద మాసంలో శుక్ల పక్ష చవితి తిథి నాడు గణపతిని పూజిస్తారు. అయితే గణపతిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే.. కోరిన కోరికలు వెంటనే తీరుతాయని చాలా మంది భావిస్తారు. మరి ఈ ఏడాది వినాయక చవితిని ఏ రోజు జరుపుకోవాలి? వినాయకుని పూజ ఏ సమయంలో చేయాలి? కోరిన కోరికలు నెరవేరి.. అదృష్టం కలిసి రావాలంటే చేయాల్సిన పూజ సమయం ఎప్పుడు? ఎలా పూజ చేస్తే మంచి ఫలితం వస్తుందో.. పూర్తి వివరాలు తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.
ప్రతి ఏడాది గణపతిని భద్రపద శుక్లపక్ష చవితి రోజున జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది చవితిని సెప్టెంబర్ 7వ తేదీ శనివారం జరుపుకుంటున్నారు. మరి ఈరోజు వినాయకుని సరైన సమయంలో పూజిస్తేనే మంచి ఫలితం వస్తుంది. చవితి తిథి ఉన్న సమయంలో మాత్రమే కాకుండా.. శుభ ముహర్తంలో గణపతిని పూజించాలి. శనివారం ఉదయం 11:03 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల లోపల వినాయకుని పూజించాలి. అయితే ఈ సమయంలో వీలు కానీ వాళ్లు సాయంత్రం 6:22 గంటల నుంచి రాత్రి 7:30 గంటల లోపల పూజించుకోవాలి. వినాయకునికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఎరుపు రంగు దుస్తులు ధరించి దేవుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరిన కోరికలు తిరుతాయి. ఆ వినాయకుని అనుగ్రహం కలుగుతుంది. వినాయకుని మొత్తం 21 పత్రి ఆకులతో పూజించాలి. దేవుడికి ఇష్టమైన నైవేద్యాలను పెట్టాలి.
వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకూడదని పండితులు అంటున్నారు. అయితే చవితి తిథి రెండు రోజులు ఉండటం వల్ల.. రెండు రోజులు చంద్రుడిని చూడకూడదు. ఈరోజు కొందరు ఉపవాసం కూడా ఉంటారు. కొందరు పూర్తిగా ఏమి తినకుండా, తాగకుండా ఉంటారు. కొందరు పండ్లు, రసాలు తాగి ఉపవాసం చేస్తారు. ఎవరి ఓపిక బట్టి వాళ్లు ఉపవాసం ఉండవచ్చు. అయితే ఉపవాస సమయంలో ఎలాంటి చెడు మాటలు ఆడకూడదు. ఒకరిని తిట్టకూడదు. ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి వాటికి దూరంగా ఉండాలి. ఈరోజు మద్యం, ధూమపానం, మాంసాహారం వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి. ఉదయాన్నే లేచి శుభ్రమైన దుస్తులు ధరించాలి. దేవుడికి ఇష్టమైన వంటలు చేసి పెట్టాలి. ఇవన్నీ భక్తి శ్రద్ధలతో వినాయకుని పూజిస్తూ.. 108 మంత్రాలు జపించాలి. ఇలా నిష్టగా నియమాలతో చేస్తే.. కోరిన కోరికలు నెరవేరుతాయి. చదువు, ఉదోగ్యం, వ్యాపారం ఇలా ఎందులో అయిన రాణించవచ్చు.