World Richest Religion : ఈ ప్రపంచంలో ఎన్నో మతాలు, కులాలు, భాషలు ఉన్నాయి. అయితే ఒక్కోరి ప్రాంతాన్ని సంప్రదాయాలు ఉంటాయి. అయితే వీరిలో ధనిక, మధ్య, పేదవారు ఇలా ఉంటారు. అయితే ఈ ప్రపంచంలో ఎందరో ధనవంతులు ఉన్నారు. మన ఇండియాలో ఎవరు అంటే అంబానీ పేరు వినిపిస్తోంది. అయితే ఇలా ధనవంతులు కాకుండా మతం పరంగా కూడా ఈ ప్రపంచంలో ఏ మతం అత్యంత ధనిక మతం చాలా మందికి తెలియదు. ఎప్పుడైనా మీకు ఈ సందేహం కలిగిందా? అసలు ఈ ప్రపంచంలో అత్యంత ధనిక మతం ఏది? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.
Also Read : ప్రియాహ్ విహార్ హిందూ ఆలయం కోసం కొట్టుకుంటున్న రెండు బౌద్ధ దేశాలు
ఈ ప్రపంచంలో అత్యధిక సంపద ఉన్న మతం క్రైస్తవ మతం. ఈ మతాన్ని అనుసరించే ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు. వీరి మొత్తం సంపద విలువ $107.28 ట్రిలియన్ డాలర్లు. అంటే ఇది ప్రపంచ మొత్తం సంపదలో దాదాపుగా 55 శాతం భాగం ఉంది. అంటే ప్రపంచంలో ఉన్న ధనవంతులలో సగానికి పైగా క్రైస్తవ మతం ఆచరించే వారు. అయితే క్రైస్తవ మతం ఎక్కువగా అమెరికా, కెనడా, యూరప్ దేశాలు, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో మాత్రమే ఉన్నారు. ఈ దేశాల్లో అభివృద్ధి కూడా ఎక్కువగానే ఉంది. అయితే క్రైస్తవ మతం తర్వాత ముస్లిం మతం రెండో స్థానంలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ముస్లిం మతాన్ని ఆచరిస్తున్న వారి మొత్తం సంపద విలువ $11.335 ట్రిలియన్ డాలర్లు. అంటే ప్రపంచ జనాభాలో ముస్లిం సుమారు 25 శాతాన్ని ఆక్రమించారు. అయితే సంపద పరంగా చూస్తే వారు రెండో స్థానంలో ఉన్నారు. ఇక మూడవ స్థానంలో అయితే హిందూ మతం. ఈ రెండు మతాల తర్వాత ఎక్కువగా అనుసరించే వారు హిందూ మతం. అయితే ఈ ప్రపంచంలోని హిందువుల దగ్గర ఉన్న మొత్తం సంపద $655 బిలియన్ డాలర్లు ఉంటుంది. అయితే ఇది ముస్లిం వారితో పోలిస్తే చాలా తక్కువ. అయితే దీనికి ముఖ్య కారణం అధిక సంఖ్యలో హిందువులు అభివృద్ధి చెందుతున్న లేదా వికసిస్తున్న దేశాలలో ఉండడమే కావచ్చని అభిప్రాయ పడుతున్నారు.
యూదు మతాన్ని అనుసరించే ప్రజల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా తక్కువగా ఉంది. కానీ వారి దగ్గర ఉన్న సంపద మాత్రం ఎక్కువగా ఉంది. $2.079 ట్రిలియన్ డాలర్లు వీరి దగ్గర ఉంది. అంటే హిందువుల కంటే మూడింతలకు పైగానే వీరి దగ్గర సంపద ఉంది. దీనికి ముఖ్య కారణం విద్య, టెక్నాలజీ, ఆర్థిక రంగాలలో వీరు ముందున్నారు. ఎక్కువ శాతం మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు కూడా ఉన్నారు. అయితే అమెరికాలో యూదు సమాజం సామాజికంగా, ఆర్థికంగా చాలా బలంగా ఉంది. అయితే ఇంకా కొందరు ధనవంతులు ఏ మతాన్ని కూడా అనుసరించడంలేదు. మతాన్ని అనుసరించని ధనవంతుల వద్ద మొత్తం $67.832 ట్రిలియన్ డాలర్ల సంపద ఉంది. అయితే ఇది ప్రపంచ మొత్తం సంపదలో 34.8 శాతం మాత్రమే.