Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు అస్థిరతల మధ్య కదలాడి స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఉదయం భారీ నష్టాలతో సూచీలు మొదలవ్వగా.. ఆ తర్వాత కోలుకొన్నాయి. చివరకు సెన్సెక్స్ 77.26 పాయింట్లు క్షీణించి 81,373 వద్ద స్థిరపడింది. అలాగే నిఫ్టీ సైతం 34.10 పాయింట్లు పతనమై 24,716.60 వద్ద ముగిసింది. నిప్టీలో అదానీ పోర్ట్, ఎం అండ్ ఎం, ఎటర్నల్, లాభాలను ఆర్జించగా.. హెచ్ డీఎఫ్ సీ లైఫ్, టాటా స్టీల్ షేర్లు నష్టాలను చవిచూశాయి.