https://oktelugu.com/

Bhogi Subhakankshalu 2025: భోగి పండగ శుభాకాంక్షలు ఈ అందమైన కొటేషన్స్ తో చెప్పండి..

ముఖ్యంగా తెలుగు పండుగ అయిన సంక్రాంతిని అచ్చమైన తెలుగులో చెప్పడం ద్వారా ఆకర్షణీయంగా మారుతారు. మరి తెలుగులో భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపేందుకు ఎలాంటి కోటేషన్లో ఉన్నాయో తెలుసా? అవి కావాలంటే ఈ కిందికి వెళ్లండి..

Written By:
  • Srinivas
  • , Updated On : January 13, 2025 / 10:21 AM IST

    Bhogi Subhakankshalu 2025

    Follow us on

    Bhogi Subhakankshalu 2025: తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద పండుగ సంక్రాంతి. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకల్లో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి చాలా మంది సొంతూరుకు వస్తుంటారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. స్నేహితులతో సరదాగా ఉంటారు. పిండివంటలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఆనందంగా గడుపుతారు. ఇదే సమయంలో ఒకరినొనకు భోగి, సంక్రాంతి శుభాకాకంక్షలు తెలుపుకుంటారు. అయితే మొబైల్ చేతిలోకి వచ్చాక చాలా మంది తమ బంధువులు, స్నేహితులకు ఫోన్ల ద్వారా మెసేజ్ పెట్టి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ మెసేజ్ సాధారణంగా ఉంటే ఎవరూ పట్టించుకోరు. ఒక కొటేషన్ ద్వారా ద్వారా శుభాకాంక్షలు తెలపడం ద్వారా ఎదుటివారి మనసును ఆకట్టుకున్నట్లు అవుతుంది. ముఖ్యంగా తెలుగు పండుగ అయిన సంక్రాంతిని అచ్చమైన తెలుగులో చెప్పడం ద్వారా ఆకర్షణీయంగా మారుతారు. మరి తెలుగులో భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపేందుకు ఎలాంటి కోటేషన్లో ఉన్నాయో తెలుసా? అవి కావాలంటే ఈ కిందికి వెళ్లండి..

    భోగి మంటల్లో మనసును తట్టి రేపుతున్న కొత్త ఆశలు నెరవేరాలని..
    కుటుంబానికి ఆశీర్వాం అందాలని కోరుకుంటూ.. భోగి శుభాకాంక్షలు.

    పాత బాధలను కాల్చివేసి.. కొత్త ఆశలను తీసుకొచ్చే భోగి పండుగతో
    మీ జీవితం సుఖమం కావాలని కోరుకుంటూ.. భోగి శుభాకాంక్షలు

    పాత గాయాలు.. పాత బాధలు ఈ భోగి మంటల్లో కాలిపోవాలి..
    కొత్త ఆశల వెలుగుల్లో కుటుంబం ఆనందంగా ఉండాలి..

    కొత్త ఆశలతో జీవితం మెరిసిపోవాలి..
    శుభాలను తీసుకొచ్చి ఆనందపరచాలని కోరుకుంటూ.. భోగి శుభాకాంక్షలు..

    కొత్త ఆశలతో కుటుంబం వైభవంగా కాంతులాడాలి..
    జీవితంలో చైతన్యం తీసుకురావాలని కోరుకుంటూ.. భోగి శుభాకాంక్షలు..

    చేదు గుర్తులు దగ్ధమై.. కొత్త ఆశలు రావాలి..
    ప్రతికోజూ మీ కుటుంబం సంతోషంగా గడపాలని కోరుకుంటూ.. భోగి శుభాకాంక్షలు..

    ఈ భోగి మంటల్లో పాత దు:ఖాలను కాలేయండి..
    జీవితాల్లో కొత్త ఆనందాన్ని నింపుకోండి..

    పాత దోషాలను భోగి మంటలతో కాల్చేయండి..
    కొత్త వసంతాన్ని తెచ్చుకోండి.. భోగి శుభాకాంక్షలు..

    మునుపెన్నడూ లేని సుఖశాంతులు
    ఈ భోగి నుంచి ప్రారంభం కావాలని కోరుకుంటూ.. భోగి శుభాకాంక్షలు..

    భోగి పండుగల వెలుగులో కుటుంబం సంతోషంగా ఉండాలి..
    కొత్త ఆశలతో పాత బాధలను తొలగించాలని కోరుకుంటూ.. భోగి శుభాకాంక్షలు..

    కన్నీళ్లు ఆవిరైపోవాలి.. నవచైతన్యం నింపుకోవాలి..
    జీవితంలో ప్రేమ, శాంతి పొందాలని కోరుకుంటూ.. భోగి శుభాకాంక్షలు..

    శాంతి, ప్రేమలతో కుటుంబమంతా కొత్త ప్రయాణం మొదలుపెట్టాలని కోరుకుంటూ.. భోగి శుభాకాంక్షలు..

    ఆనందాల భోగి నాడు చేపట్టే కార్యక్రమాలు విజయవంతం కావాలని కోరుకుంటూ.. భోగి శుభాకాంక్షలు..

    ఈ భోగితో మీ జీవితంలో భోగ భాగ్యాలు రావాలి.. సంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటూ.. భోగి శుభాకాంక్షలు..

    ఈ భోగితో మీ ఇంట్లో సంబరాలు రావాలని కోరుకుంటూ.. భోగి శుభాకాంక్షలు..

    మామిడి తోరణాలతో.. ముత్యాల ముగ్గులతో.. ఇల్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ.. భోగి శుభాకాంక్షలు..

    ఈ భోగి పండుగతో మీ ఇంట ఆనందం వెల్లివిరియాలి.. కుటుంబం సంతోషంగా ఉండాలి..

    ఈ పండుగ మీ ఇంట కొత్త వెలుగులు నింపాలి. . భోగి శుభాకాంక్షలు..