Daaku Maharaaj: ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక మంచి గుర్తింపునైతే సంపాదించుకున్నారు. ఇక బాబీ లాంటి దర్శకుడు సైతం వరుస విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇప్పుడు ఆయన చేయబోతున్న సినిమా ద్వారా ఆయన ఎలాంటి సక్సెస్ ను అందుకోబోతున్నాడనేది తెలియాల్సి ఉంది…ఇక ఇప్పటికే చాలామంది దర్శకులు కమర్షియల్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్న నేపధ్యం లో బాబీ కూడా అదే బాటలో నడుస్తూ మంచి విజయాలను అందుకుంటున్నాడు…
బాలయ్య బాబు హీరోగా బాబీ డైరెక్షన్ లో వచ్చిన ‘డాకు మహారాజ్’ సినిమా సక్సెస్ ఫుల్ టాక్ ను సంపాదించుకుంటు ముందుకు సాగుతుంది. అయితే ఈ సినిమాలో పెద్దగా వైవిద్య భరితమైన కథాంశమైతే ఏమీ లేదు. అయినప్పటికి బాబీ ఈ సినిమాని చాలా యంగేజింగ్ తీసుకెళ్ళాడు… అందువల్ల ఈ సినిమా చాలా వరకు ప్రేక్షకులకు నచ్చే ప్రయత్నం అయితే చేసింది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా బాబి ఇంతకుముందు చేసిన సినిమాల మాదిరిగానే రొటీన్ రొట్ట ఫార్ములాలో కొనసాగుతుంది. అలాగే వాల్తేరు వీరయ్య సినిమాలో సముద్రాన్ని ఆసరాగా చేసుకొని బిజినెస్ చేస్తూ అందులోనే డ్రగ్స్ వ్యాపారాన్ని కొనసాగిస్తున్న కొంతమందిని పట్టుకోవడానికి చిరంజీవి తిరుగుతూ ఉంటాడు. అయితే ఈ సినిమాలో కూడా గ్రానైట్ రాళ్ళల్లో కొకైన్ ను సప్లై చేస్తూ ఇల్లీగల్ బిజినెస్ ను కొనసాగిస్తున్న రౌడీలను అంతం చేయడం కోసం ఈ సినిమాలోని ప్లాట్ పాయింట్ అయితే ముందుకు సాగుతుంది.
మరి ఏది ఏమైనా కూడా ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి ఈ సినిమాకి కొంతవరకు పోలికలైతే ఉన్నాయంటూ కొంతమంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఈ సంక్రాంతికి బాలయ్య బాబు చేసిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది… మరి ఏది ఏమైనా బాలయ్య ఈ సంక్రాంతి విన్నర్ గా నిలుస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక ఏది ఏమైనా ఈ సంవత్సరం కూడా బాలయ్య మంచి విజయాన్ని సాదిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక 2025 వ సంవత్సరంలో బాలయ్య సక్సెస్ తో మొదలుపెట్టి మరొక సినిమాని కూడా ఈ సంవత్సరమే రంగంలోకి దింపే ప్రయత్నమైతే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి బాలయ్య ఈ సినిమాలతో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగితే సీనియర్ హీరోల్లో వరుస విజయాలను అందుకుంటున్న హీరోగా ఆయన మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ఏది ఏమైనా కూడా ఆయనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న బాలయ్య ఇకమీదట కూడా భారీ సక్సెస్ లను సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… చూడాలి మరి ఇకమీదట బాలయ్య బాబు ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. తద్వారా ఆయన కెరీర్ అనేది ఏ విధంగా ముందుకు సాగబోతుంది అనేది…