https://oktelugu.com/

పూజగదిలో చెంబులో నీరు ఎందుకు ఉంచుతారు?

నీటిని గంగతో పోలుస్తాం. ఎలాంటి పాపాలనైనా గంగ కడిగేస్తుంది. అలాగే నెగెటివ్ ఎనర్జీ నుంచి పాజిటివ్ ఎనర్జీకి మారడానికి గంగ సాయం చేస్తుంది. ఇక పూజ గదిలో ఎప్పటికీ నీరు ఉంచడం వల్ల దేవతలు హర్షిస్తారు. ఏ రోజు పూజ చేస్తామో.. ఆరోజు రాగి పాత్రలో నీరు పట్టి ఉంచి ఆ నీటిని అదే రోజు లేదా మరునాడు తాగితే ఎలాంటి అనారోగ్యమైనా నయమవుతుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : May 12, 2024 / 03:46 PM IST

    ragi chembulo neeru

    Follow us on

    జీవితంలో కొన్ని పనులు ఎంత కష్టపడి చేసినా సక్సెస్ కావు. ఇలాంటి సమయంలో దైవం తోడుండాలంటారు. అయితే దైవానికి సంబంధించిన కార్యక్రమాలు చేసేటప్పుడు పూజలు, వ్రతాలు మాత్రమే కాకుండా కొన్ని పద్దతులు పాటించాలి. ముఖ్యంగా ఇంట్లో ఉన్న పూజ గదిలో కొన్ని వస్తువులు ఉంచడం వల్ల అదనపు ఫలితాల ఉంటాయి. వీటిలో రాగి చెంబులో నీళ్లు ఉంచడం. పూజగదిలో రాగిచెంబులో నీరు ఉంచడం గమనిస్తూ ఉంటాం. ఇలా పూజ గదిలో రాగి లేదా మట్టి పాత్రలో నీరు ఉంచడం వల్ల ఏం జరుగుతుందంటే?

    నీటిని గంగతో పోలుస్తాం. ఎలాంటి పాపాలనైనా గంగ కడిగేస్తుంది. అలాగే నెగెటివ్ ఎనర్జీ నుంచి పాజిటివ్ ఎనర్జీకి మారడానికి గంగ సాయం చేస్తుంది. ఇక పూజ గదిలో ఎప్పటికీ నీరు ఉంచడం వల్ల దేవతలు హర్షిస్తారు. ఏ రోజు పూజ చేస్తామో.. ఆరోజు రాగి పాత్రలో నీరు పట్టి ఉంచి ఆ నీటిని అదే రోజు లేదా మరునాడు తాగితే ఎలాంటి అనారోగ్యమైనా నయమవుతుంది. ఈ నీటిని ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తరువాత తీర్థం లాగా సేవించినా మంచే జరగుతుంది.

    రాగి పాత్రలో నీరు పూజ గదిలో ఉండడం వల్ల ఎలాంటి దుష్ట శక్తులు ఇంట్లోకి రావు. వీటిని తాగడానికి ఇష్టపడని వారు చెట్లకు పోయొచ్చు. ఇలా చేట్లకు పోయడం వల్ల ఇంట్లో అంతా మంచే జరుగుతుంది. కొన్ని ఇళ్లల్లో ఎప్పటికీ డబ్బు నిల్వదు. డబ్బు నిల్వ ఉండాలంటే కూడా పూజ గదిలో నీళ్లను ఉంచుతూ ఉండాలి. ఇక ఇంట్లో ఎప్పుడూ గొడవలు పడేవారు చెబులో నీళ్లు నింపి పూజగదిలో ఉంచాలి. ఏవైనా కోరికలు కోరుకునేవారు ఇలా చెంబులో నీరు నింపి అక్కడ ఉంచడం వల్ల వారి కోరికలు నెరవేరుతాయని అంటున్నారు.