https://oktelugu.com/

Nagababu: నాగబాబుకు ఎలక్షన్ కమిషన్ షాక్

పిఠాపురంలో వైసీపీ నేతలు డబ్బులు ఆశ చూపి చేతివేళ్లపై సిరా పోస్తున్నారని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. దీనిపై ఈసీ స్పందించింది. అది తప్పుడు వార్తగా ధృవీకరించింది.

Written By:
  • Dharma
  • , Updated On : May 12, 2024 / 03:43 PM IST

    Nagababu

    Follow us on

    Nagababu: పోలింగ్ కు మరి కొద్ది గంటల వ్యవధి మాత్రమే ఉంది. ఈసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పోలింగ్ సామాగ్రితో సిబ్బంది ఆయా ప్రాంతాలకు బయలుదేరారు. అయితే నాగబాబు చేసిన ప్రకటనపై ఈసీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. ఆయన కామెంట్స్ ను తప్పు పట్టింది. నిజాలను నిర్ధారించుకుని మాత్రమే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలని సూచించింది. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    పిఠాపురంలో వైసీపీ నేతలు డబ్బులు ఆశ చూపి చేతివేళ్లపై సిరా పోస్తున్నారని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. దీనిపై ఈసీ స్పందించింది. అది తప్పుడు వార్తగా ధృవీకరించింది. అందులో ఎంత మాత్రం నిజం లేదని తేల్చి చెప్పింది. ఒక సమాచారం షేర్ చేసే ముందు.. నిజమా? కాదా? అని నిర్ధారించుకుని చేయాలని సూచించింది. అందరం కలిసి రాష్ట్రంలో ఓటింగ్ ను ప్రోత్సహిద్దామని చెప్పుకొచ్చింది. మరోవైపు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి నాగబాబు కవితాత్మక ట్విట్ చేశారు.’ సిరా పూసిన సామాన్యుడు వేలి సంతకంతో నీ గెలుపు సిద్ధమయ్యింది’ అంటూ వ్యాఖ్యానించారు. దీనికి పవన్ కళ్యాణ్ చెమటను స్వయంగా నాగబాబు తుడుస్తున్న ఫోటోను పోస్ట్ చేయడం విశేషం. నిన్ను నమ్మని వాళ్లకోసం కూడా ఎందుకు నిలబడతావు అని అడిగితే చెట్టును చూపిస్తాడు. అది నాటిన వాళ్ళకి మాత్రమే నీడనిస్తుందా అని దాని అర్థం. నీతో నడవని వాళ్లకోసం కూడా ఎందుకు నిందలు మోస్తావు అని అడిగితే వర్షాన్ని చూపిస్తాడు. తనని మొక్కని రైతు కంటినితడపకుండా పంటనే తడుపుతోందని దాని అర్థం. అప్పటినుంచి అడగడం మానేసి.. ఆకాశం లాంటి అతడి ఆలోచన విశాలతని అర్థం చేసుకోవడం మొదలు పెట్టాను. సేనాని మీరు చిందించిన ప్రతి చెమట బొట్టు రేపటి తరం ఎక్కపోయే మార్గదర్శకు మెట్టు కాబోతుంది కూటమి రాబోతోంది.. అంటూ నాగబాబు ట్విట్ చేశారు.

    పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో ఆయన అక్కడే ఉన్నట్టు సమాచారం. సోమవారం జరగనున్న పోలింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు ఏర్పాటు చేసుకున్నారు. మరోవైపు నాగబాబు చేసిన తాజా ట్విట్ వైరల్ అంశంగా మారింది. జన సైనికులు వరుసగా పోస్టులు పెడుతున్నారు.