Animals eat their own children: కాకిపిల్ల కాకికే ముద్దు అన్నట్లు.. ఎవరి బిడ్డ అంటే వారికి ఇష్టం ఉంటుంది. ప్రతి తల్లి తన కన్న బిడ్డలను అసలు చేతులారా చంపుకోదు. అవసరమైతే తన ప్రాణాలను బలంగా పెట్టి కన్నబిడ్డలను ప్రతీ తల్లి కాపాడుతుంది. మనుషులు అయిన జంతువులు అయిన కూడా వాళ్ల బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటాయి. ఇతర జంతువుల ఏవి తినకుండా ఉండేందుకు ఎంతో జాగ్రత్తగా పిల్లలను కాపాడుకుంటాయి. అసలు ఏ జంతువులు అయిన మనుషుల్లో ఉన్న అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పిన తక్కువే. అయితే ఇదంతా పక్కన పెడితే కొన్ని జంతువులు సొంత బిడ్డలనే ఆహారంగా తింటాయట. మీరు నమ్మిన నమ్మకపోయిన ఇది నిజం. సొంత తల్లే ఆకలి కోసం కన్న బిడ్డలను తింటాయట. మరి తమ పిల్లలను తినే జంతువులు ఏవి? అసలు ఎందుకు ఇవి సొంత బిడ్డలను తింటాయి? దీనికి గల కారణాలే ఏంటో మరి ఈ ఆర్టికల్‌లో చూద్దాం.
మృగరాజులు
మగ సింహాలు ఆధిపత్యాన్ని చెలాయించడానికి పిల్లలను చంపేస్తాయట. ఎందుకంటే కొత్త మగ సింహం పుడితే అది పెద్దయ్యి ఎక్కడ ఆధిపత్యం చెలాయిస్తుంది ఏమోనని ముందుగానే వాటిని చంపేస్తాయి.
బ్లాక్ విడో స్పైడర్
సాలె పురుగుల్లో ఆడ నల్ల సాలెపురుగులు సంభోగం తర్వాత మగ సాలెపురుగులను తినేస్తాయి.
ఎందుకంటే ఇవి మళ్లీ ఇంకో సాలె పురుగుతో కలవకూడదనే ఉద్దేశంతో తినేస్తాయట. అలాగే ఆహారం లేకపోతే కొన్నిసార్లు సొంత బిడ్డలను చంపి తింటాయట.
ప్రేయింగ్ మాంటిస్
ఆడ ప్రేయింగ్ మాంటిస్‌లు సంభోగం తర్వా మగ పిల్లలను చంపి తింటాయి. అలాగే ఇవి బాగా ఒత్తిడికి గురైనప్పుడు లేదా బాగా ఆకలిగా ఉన్నప్పుడు కూడా సొంత పిల్లలను చంపి తింటాయి. కొన్నిసార్లు దాచిన గుడ్లును కూడా ఇవి తింటాయి.
చిట్టెలుక
సాధారణంగా చిట్టెలుకలు కరుస్తుంటాయి. ఇవి తల్లులను కరిచిన, అలా ప్రవర్తించిన కూడా చంపి తినేస్తాయి. ఒకవేళ చిట్టెలుక అనారోగ్యంతో ఉన్నా కూడా వాటిని చంపి తల్లులు తింటాయి.
ఎలుకలు
ఎలుకల పిల్లలు బలహీనంగా ఉంటే ఆడ ఎలుకలు ఎక్కువగా తింటాయి. ఒకవేళ ఇవి ఒత్తిడికి గురైన కూడా సొంత పిల్లలను తింటాయి. ఒకవేళ ఇతర కారణాల వల్ల ఎలుకలు చనిపోయిన కూడా వాటిని తినేస్తాయి.
ధృవపు ఎలుగుబంటి
ధృవపు ఎలుగుబంటులు చాలా తక్కువ సందర్భాల్లో తమ పిల్లలను చంపి తింటాయి. ఆహారం ఎక్కువగా పోరాడిన తర్వాత ఎక్కడ కూడా ఆహారం దొరక్కపోతే.. చిరాకు చెంది తమ సొంత పిల్లలను చంపి తింటాయి. అయితే ఇది అన్ని సందర్భాల్లో అన్ని ధృవపు ఎలుగుబంటులు చేయవు. సందర్భాన్ని బట్టి కొన్ని ఎలుగుబంటులు మాత్రమే ఇలా చేస్తాయి.
గోల్డెన్ ఈగిల్
ఈ ఈగిల్ తల్లిదండ్రులకు కొన్నిసార్లు ఆహారం చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయాల్లో తమ సొంత బిడ్డలను కూడా ఈ గోల్డెన్ ఈగిల్ తినేస్తాయి.
హైనా
మాంసాహారి క్షీరదమైన హైనా తన సొంత పిల్లలను తినేస్తుంది. ఎక్కువగా ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో కనిపించే ఈ జంతువు ఆడపిల్లలను ఎక్కువగా తింటాయట. అందులోనూ తక్కువ స్థాయిలో ఉన్న ఆడపిల్లలను చంపి ఆహారంగా తింటాయి.