AP Assembly Elections Results 2024: టీడీపీ నుంచి ముగ్గురు.. మిగతా పార్టీల నుంచి సున్నా..

గుంటూరు ఈస్ట్‌ నుంచి మహ్మద్‌ నసీర్‌ అమ్మద్‌ విజయం సాధించాడు. ఇక నంద్యాల నుంచి మహ్మద్‌ ఫరూక్, మదన పల్లి నుంచి షాజహాన్‌ బాషా విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్‌లో 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభాలో 9.5 శాత మంది మైరారిటీలు ఉన్నారు.

Written By: Raj Shekar, Updated On : June 7, 2024 4:02 pm

AP Assembly Elections Results 2024

Follow us on

AP Assembly Elections Results 2024: ఏపీ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ 135 స్థానాల్లో విజయం సాధించింది. జనసేన పార్టీ 21 సీట్లు గెలిచింది. వైఎస్సార్‌సీపీ 11 చోట్ల, బీజేపీ 8 చోట్ల గెలిచాయి.

తగ్గిన మైనారిటీల ప్రాతినిధ్యం..
ఈ ఎన్నికల ఫలితాల తర్వాత అసెంబ్లీలో మైనారిటీల ప్రాతినిధ్యం తగ్గింది. టీడీపీ ఈసారి ముగ్గురు మైనారిటీలకు టికెట్‌ ఇవ్వగా, వైసీపీ 8 మందికి టికెట్లు ఇచ్చింది. బీజేపీ, జనసేన ఒక్క మైనారిటీకి కూడా టికెట్‌ కేటాయించలేదు. వైసీపీ టికెట్లు ఇచ్చిన మైనారిటీల్లో ఒక్కరు కూడా గెలవలేదు. ఇక టీడీపీ టికెట్లు ఇచ్చిన ముగ్గురు గెలిచారు. దీంతో ఈసారి అసెంబ్లీలో మైనారిటీలకు ప్రాతినిధ్యం వహించేది ఈ ముగ్గురే.

గెలిచింది వీరే..
గుంటూరు ఈస్ట్‌ నుంచి మహ్మద్‌ నసీర్‌ అమ్మద్‌ విజయం సాధించాడు. ఇక నంద్యాల నుంచి మహ్మద్‌ ఫరూక్, మదన పల్లి నుంచి షాజహాన్‌ బాషా విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్‌లో 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభాలో 9.5 శాత మంది మైరారిటీలు ఉన్నారు. వీరంతా ఓబీసీలుగా పరిగణించబడుతున్నారు. తామూ మూడోసారి అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ ప్రకటించింది. బీజేపీ కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చింది. ఇక ఏపీలో బీజేపీ–టీడీపీ–జనసేన కూటమిగా పోటీ చేశాయి. ఈ సమయంలో మైనారిటీల ప్రాతినిధ్యం తగ్గడం గమనార్హం.

మంత్రి పదవి ఎవరికో..
ఇదిలా ఉండగా, ఏపీలో కొత్తగా ఏర్పడే ఎన్‌డీఏ ప్రభుత్వంలో టీడీపీ ఎక్కువ మంత్రి పదవులు తీసుకోవడం ఖాయం. తర్వాత జన సేనకు, తర్వాత బీజేపీకి పదవులు వరిస్తాయి. మైనారిటీ కోటాలో మంత్రి పదవులు ఇవ్వాల్సి వస్తే టీడీపీ తరఫున గెలిచిన ముగ్గురు మహ్మద్‌ నసీర్‌ అమ్మద్, మహ్మద్‌ ఫరూక్, షాజహాన్‌ బాషా లలో ఒకరికి దక్కుతుంది. ఆ ఒక్కరు ఎవరు అనేది ఇప్పుడు ఏపీ మైనారిటీల్లో చర్చనీయాంశంగా మారింది.