Lunar Eclipse: భారతదేశంలో సెప్టెంబర్ 7న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఇది రాహు గ్రస్త చంద్రగ్రహణం కావడంతో కొన్ని రాశులపై తీవ్రమైన ప్రభావం ఉండనుంది. మరికొన్ని రాశుల వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఈ చంద్రగ్రహణం ఆసియాలోని కొన్ని దేశాలతో పాటు భారతదేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో సంపూర్ణంగా ఉండనుంది. దీంతో ఇక్కడ సూతకాలం పనిచేయనుంది. ఈ నేపథ్యంలో ఆలయాలు మూసివేయనున్నారు. గర్భిణీలు జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అయితే చంద్రగ్రహణం కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. మరికొన్ని రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు ఉండలున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని రాశుల వారు చంద్రగ్రహణంను చూడకపోవడమే మంచిది అని పండితులు చెబుతున్నారు. మరి ఎలాంటి వారికి.. ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
రాహు గ్రస్త చంద్రగ్రహణం కారణంగా కొన్ని రాశుల వారికి అనుకూలమైన ఫలితాలు ఉండనున్నాయి. . వీరు గ్రహణం చూసినా..ఎలాంటి నష్టం ఉండదు. మరి కొన్ని రాశుల వారికి మధ్యస్థ ఫలితాలు ఉండనున్నాయి. వీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకొన్ని రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు ఉండలున్నాయి. దీంతో ఈ రాశి వారు గ్రహణం చూడకపోవడమే మంచిది అని పండితులు అంటున్నారు.
తుల, వృశ్చిక, ధనుస్సు రాశి వారికి చంద్రగ్రహణం అనుకూలంగా ఉండనుంది. వీరు చంద్రగ్రహణం చూసిన ఎలాంటి నష్టం ఉండదు. అయినా చంద్రగ్రహణం సమయంలో ఇష్ట దైవ నామస్మరణ చేయడం ఎంతో మంచిది.
మేషం, వృషభం, కర్కాటకం, కన్య, మకరం, మీనం రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉండనున్నాయి. ఈ రాశి వారు చంద్రగ్రహణం చూసిన ఎలాంటి నష్టం ఉండకపోవచ్చు. కానీ గ్రహణం సమయంలో వీరు ప్రత్యేక పూజలు చేసుకోవడం వల్ల అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది.
మిధునం, సింహం, కుంభం రాశి వారికి చంద్రగ్రహణం చెడు ఫలితాలు ఇవ్వనుంది. అందువల్ల ఈ రాశి వారు గ్రహణంను చూడకపోగా.. గ్రహణం సమయంలో రాహు పూజలు చేయడం వల్ల కాస్త ఫలితం ఉండే అవకాశం ఉంటుంది.
సెప్టెంబర్ 7న రాత్రి 9.56 గంటలకు గ్రహణం ప్రారంభమై సెప్టెంబర్ 8న ఉదయం 1.10 గంటల వరకు కొనసాగుతుంది. గ్రహణ సమయంలో చెడు ఫలితాలు కలిగే రాశుల వారు జాగ్రత్తగా ఉండడంతో పాటు ఇష్ట దైవాన్ని స్మరించుకోవడం వల్ల దోష నివారణ జరిగే అవకాశం ఉంటుంది. అయితే వీరితో పాటు గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గ్రహణ సమయంలో ఎలాంటి శుభ కార్యక్రమాలు లేదా.. కొత్త పనులు మొదలు పెట్టరాదు. గ్రహణం పూర్తయిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకుని ఆ తర్వాత ఆహారం పండుకోవాలని పండితులు చెబుతున్నారు. గ్రహణం సమయంలో ఎలాంటి ఆహార, పానీయాలు తీసుకోకూడదని చెబుతున్నారు. అయితే నిలువ ఉన్న పదార్థాల్లో గరిక వేయడం వల్ల వాటిని తిరిగి ఉపయోగించుకోవచ్చని అంటున్నారు.