Magha Purnima 2025 : హిందూ శాస్త్ర ప్రకారం పండుగలు మాత్రమే కాకుండా ప్రత్యేక రోజుల్లో కొన్ని కార్యక్రమాలు చేయడం వల్ల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతూ ఉంటారు. సంక్రాంతి తర్వాత కొన్ని రోజులపాటు శూన్యంగా ఉండి ఆ తర్వాత వచ్చే మాఘ మాసంలో శుభదినాలు ప్రారంభమవుతాయి. ఈ మాసంలో ఎక్కువగా వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఇదే సమయంలో కొన్ని ప్రత్యేక రోజులు వస్తూ ఉంటాయి. వీటిలో మాఘమాస పౌర్ణమి ఒకటి. మిగతా పౌర్ణమిలో కంటే మాఘమాసంలో వచ్చే పౌర్ణమి విశిష్టమైనది. ఈరోజు పితృ కార్యక్రమాలు చేయడం వల్ల పూర్వీకులు సంతోషిస్తారని చెబుతారు. ఇందులో భాగంగా నది స్నానం చేయడం చాలా మంచిది అని కొందరు చెబుతున్నారు. నది స్నానం చేయడంతో పాటు కొన్ని పుణ్య కార్యాలు చేయడం వల్ల దోషాలు తొలగిపోతాయని అంటున్నారు. అయితే ఈరోజు ఎలాంటి పూజలు చేయాలి?
2025 సంవత్సరంలో ఫిబ్రవరి 12వ తేదీన మాఘమాస పౌర్ణమి వస్తోంది. ఈరోజున నది లేదా సమీపంలోని పారే నీటిలో స్నానాలు చేయడం వల్ల వ్యాధుల భారీ నుంచి తప్పించుకోవచ్చని అంటున్నారు. అలాగే భక్తిశ్రద్ధలతో దైవాన్ని పూజించడమే కాకుండా దానధర్మాలు చేయాలి. ఈ రోజున నువ్వులు, గొడుగులు దానధర్మాలు చేయడం వల్ల గత జన్మలో ఉండే పాపాలు తొలగిపోతాయి.
అయితే మాఘమాస పౌర్ణమి రోజున పితృ కార్యక్రమాలు చేయడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయని పురాణాల్లో చెప్పబడింది. అందుకోసం ఎలాంటి పూజలు చేయాలి? అనేది తెలుసుకుందాం.
మాఘమాసం పౌర్ణమి రోజున ఉదయం నదిలో స్నానం చేయాలి. నడుములోతు నీటిలో ఉండి పవిత్ర జలాన్ని అరచేతిలోకి తీసుకొని ఆ తర్వాత పూర్వీకులను గుర్తు చేసుకోవాలి. తర్వాత బొటనవేలు చూపుడువేలు మద్యమం ద్వారా పూర్వీకులకు నీటిని సమర్పించాలి. ఈ రోజున నల్ల నువ్వుల సహాయంతో పితృదేవతలకు తర్పణం సమర్పించాలి. ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతృప్తి చెంది ఆశీస్సులు అందిస్తారు.
ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత పితృదేవతలను ప్రసన్న చేసుకోవడానికి ఆహారం, వస్త్రాలను ఇతరులకు దానం చేయాలి. వీటిలో ముఖ్యంగా తెల్లని రంగు దుస్తులు ఉండాలి. ఇలా దానం చేయడం వల్ల పూర్వీకులు శాంతిస్తారు. అలాగే పితృ దోషం నుండి విముక్తి పొందే అవకాశం ఉంటుంది. పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి ఈ రోజున సాయంత్రం ఆవ నూనెతో దీపాన్ని వెలిగించాలి. సూర్యాస్తమం తర్వాత నువ్వు నూనెతో దీపం వెలిగించాలి. ఇంటి బయట దక్షిణం దిశలో ఈ దీపాన్ని ఉంచాలి. ఇలా చేయడం వల్ల పూర్వీకుల కోపాన్ని తగ్గించవచ్చని చెబుతున్నారు.ఇలా చేయడం ఇలా చేయడం వల్ల పూర్వికులు సంతోషించి వారి కుటుంబ సభ్యులను చల్లని చూపుతో చూస్తారు. దీంతో వారికి ఎలాంటి ఆటంకాలు లేకుండా కార్యక్రమాలన్నీ పూర్తి చేయగలుగుతారు.