Homeజాతీయ వార్తలుHug Day : నేడు హగ్ డే.. కౌగిలింతలో ఎన్ని రకాలు ఉంటాయో తెలుసా .....

Hug Day : నేడు హగ్ డే.. కౌగిలింతలో ఎన్ని రకాలు ఉంటాయో తెలుసా .. ప్రతీదీ ప్రత్యేకమే !

Hug Day : ప్రస్తుతం మనం ఇంటర్నెట్ ప్రపంచంలో బతుకుతున్నాం. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత మెసేజ్‌లు చేసుకోవడం, విషెస్ చెప్పుకోవడం, ఒకరినొకరు పలకరించుకోవడాలన్నీ స్మార్ట్ ఫోన్ల పైనే జరిగిపోతున్నాయి. ఎక్కడో ఉన్న వ్యక్తితో వీడియో కాల్ మాట్లాడి మనలోని ఎమోషన్లను బయటపెడుతున్నాం. అయితే వేల మాటల కన్నా ఒక్క కౌగిలింత ఎంతో ఊరటనిస్తుందన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ఫిజికల్ టచ్‌తో వ్యక్తిలోని ఆనందాన్ని రెండింతలు చేయవచ్చు. ఎదుటి వారి బాధను తగ్గించవచ్చు. అంతటి పవర్ ఉండడం వల్లే కౌగిలింతకు సపరేట్ ఓ రోజును కేటాయించారు. వాలెంటైన్స్ వీక్ లో భాగంగా ఐదో రోజును హగ్ డేగా పిలుస్తారు. ఫిబ్రవరి 12న హగ్ డే నిర్వహిస్తుంటారు.

సాధారణంగా వాలెంటైన్స్ వీక్‌లో భాగంగా హగ్ డే నిర్వహించుకోవడం కొత్తేమీ కాదు. నాటి నుంచే కౌగిలింతకు ప్రాధాన్యత ఉంది. మన ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేసేందుకు కౌగిలింత చక్కటి మార్గం. ఫ్రెండ్‌షిప్, లవ్, కంఫర్ట్‌ని ఎదుటివారికి తెలియజేసేందుకు హగ్‌ చేసుకుంటారు. ఇది కేవలం ఫిజికల్ టచ్ కు సంబంధించినది కాదు. ఒక్క హగ్‌తో మానసికంగా, సైకలాజికల్‌గా ఎన్నో లాభాలు ఉంటాయి. సంప్రదాయ వైద్యంలోనూ కౌగిలింత ఒక మెడిసిన్‌లా పనికొస్తుందని తేలింది. కొన్ని రకాల ట్రీట్‌మెంట్స్‌కు వాడే మందులకు బదులుగా, ఒక్క కౌగిలింత ఇచ్చే ధైర్యం చాలా బాగా పని చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డేకి ముందు ఏడు రోజులు ప్రేమను తమ ఇష్టమైన వారికి వివిధ మార్గాల్లో తెలుపుకుంటారు. వాలెంటైన్స్ వీక్‌లోని ఆరవ రోజును హగ్ డే అని పిలుస్తారు. దీనిని ప్రతిరోజు ఫిబ్రవరి 12న జరుపుకుంటారు. ఈ కథనంలో ఏడు రకాల కౌగిలింతలను.. అవి మీ సంబంధం గురించి ఏమి తెలియజేస్తాయో చూద్దాం.

7 ప్రధాన రకాల కౌగిలింతల గురించి తెలుసుకుందాం:
1. బేర్ హగ్
ఈ కౌగిలింత చాలా బలమైనది, పొడవైనది. గుండె నిండా ప్రేమను ప్రకటించేలా ఉంటుంది. ఇది ఎక్కువగా ప్రేమికులు, కుటుంబ సభ్యులు లేదా అత్యంత సన్నిహిత మిత్రుల మధ్య ఉంటుంది. ఇది ప్రేమ, అనుబంధం, రక్షణకు ప్రతీకగా ఉంటుంది.

2. వన్ సైడ్ హగ్
ఈ హగ్‌లో ఒకరు మాత్రమే పూర్తిగా కౌగిలింత ఇవ్వగా, మరొకరు కొంత దూరంగా ఉండటం గమనించవచ్చు. ఇది భావోద్వేగ దూరం లేదా సంకోచాన్ని సూచిస్తుంది. ఒక సంబంధంలో ఎటువంటి సమస్యలు, మనసులో ఉండే దూరం గురించి ఇది చెప్పేలా ఉంటుంది.

3. బ్యాక్ హగ్
ప్రేమికుల మధ్య ఈ రకమైన కౌగిలింత ఎక్కువగా కనిపిస్తుంది. ఇది విశ్వసనీయత, ప్రేమ, రక్షణను సూచిస్తుంది. ఒక వ్యక్తి వెనుక నుంచి ఇతరుని కౌగిలించేటప్పుడు, అది “నేను నీతో ఉన్నాను” అని సంకేతం తెలిపేందుకు ఈ హగ్ ఉపయోగిస్తారు. ఇది ఆ వ్యక్తి పట్ల మంచి అనుబంధాన్ని చూపిస్తుంది.

4. సైడ్ హగ్
సైడ్ హగ్ సాధారణంగా స్నేహితులు లేదా అక్క, చెల్లెలు వంటి కుటుంబ సభ్యుల మధ్య ఉంటుంది. ఇది తాత్కాలికంగా సౌకర్యవంతంగా అనిపించే విషయం.

5. లాంగ్ టైట్ హగ్
ఈ రకమైన కౌగిలింత ఎక్కువ సమయం తీసుకుని, బలంగా ఉంటుంది. ఇది అనుభూతి సులభంగా వ్యక్తం చేసేలా ఉంటుంది. ఇది ఎక్కువగా మిత్రులు, కుటుంబ సభ్యులు, లేదా ప్రేమికుల మధ్య ఉంటాయి.

6. పాట్ ఆన్ ది బ్యాక్ హగ్
ఈ రకమైన కౌగిలింత సాధారణంగా ప్రోత్సాహం లేదా మానవ సంబంధాలలో బంధం, గౌరవం మొదలైన వాటికి దారితీయడమే. ఇది స్నేహితుల మధ్య లేదా వృత్తి సంబంధాల మధ్య ఉంటుంది.

7. హెడ్ ఆన్ చెస్ట్ హగ్
ఈ హగ్ లో ఒకరు వారి తలను మరొకరి ఛాతీలో పెట్టుకుని, కౌగిలించుకుంటారు. ఇది ఆత్మ విశ్వాసం, సురక్షిత భావం, అనుబంధాన్ని సూచిస్తుంది. ఇది ఎక్కువగా ప్రేమికులు లేదా సన్నిహిత మిత్రుల మధ్య కనిపిస్తుంది.

హగ్ అనేది మనసులోని భావాలను వ్యక్తపరిచే ఒక అద్భుతమైన మార్గం. ప్రేమ, స్నేహం, బంధం, భద్రత, సహాయం అన్నీ ఈ కౌగిలింతల ద్వారా వ్యక్తమవుతాయి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular