Nava Pancham Yoga: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాల మార్పుతో ఆయా రాశులపై ప్రభావం పడుతుంది. గ్రహాలు కొన్ని సందర్భాల్లో తమ స్థితిని మార్చుకుంటూ ఉంటాయి. గత ఆదివారం నుంచి నవ పంచమి యోగం ప్రారంభమైంది. దీంతో కొన్ని రాశుల్లో మార్పులు తెచ్చింది అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. సాధారణంగా నవ పంచమి యోగం ఏర్పడితే కొన్ని రాశులపై ప్రత్యక్షంగా ప్రభావం పడి ఆ రాశులు కలిగిన వారి జీవితాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. గతంలో పడిన కష్టాల నుంచి బయటపడతారు. కొత్తగా ఏ పని మొదలుపెట్టిన సక్సెస్ సాధిస్తారు. అయితే ప్రస్తుతం ఏ రాశుల వారు అదృష్టవంతులు చూద్దాం..
నవ పంచమి యోగం కారణంగా మేష రాశి వారికి అనుకోని అదృష్టం వరిస్తుంది. ఇన్నాళ్లు పడిన కష్టమంతా మాయమవుతుంది. కొత్తగా పనిని చేపట్టడానికి ఆస్కారం ఏర్పడుతుంది. వీరికి సమాజంలో గుర్తింపు లభించి.. అనుకున్న అనుకున్న పనులు చేయగలుగుతారు. లక్ష్మీదేవి ఈ రాశి వారి ఇంటికి రావాలని చూస్తూ ఉంటుంది. అయితే కొన్నిసార్లు ప్రత్యేక పూజలు చేయడం వల్ల మరింత ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతులు పొందడానికి మార్గం ఏర్పడుతుంది. పాత స్నేహితులను కలవడం వల్ల ఉల్లాసంగా ఉంటారు. అనుకోకుండా ప్రయాణాలు. ఉంటాయి ఇవి ఆర్థిక ప్రయోజనాలు కలిగిస్తాయి. వ్యాపారులు భాగస్వాములతో చేసే చర్చలు ఫలిస్తాయి.
మిధున రాశి వారు కమ్యూనికేషన్ రంగంలో ఉన్నట్లయితే వారు అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయగలుగుతారు. వీరు సమాజంలో ఎక్కువగా తిరిగేవారు అయితే మరింత గౌరవం పెరిగి ప్రజాదరణ పొందుతారు. రాజకీయ నాయకులు ఊహించని పదవులు పొందుతారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే తప్పకుండా విజయం సాధిస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఆరోగ్య విషయంలో కూడా కేర్ తీసుకోవడం వల్ల కుదుటపడుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కొత్త ప్రాజెక్టులు చేపట్టే ముందు తల్లిదండ్రుల సలహా తీసుకోవాలి.
సింహ రాశి వారికి నవ పంచమి యోగం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. వీరు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేసి అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వీరికి సీనియర్ల మద్దతు ఉండడం వల్ల కొన్ని ప్రాజెక్టులను ఈజీగా పూర్తి చేయగలుగుతారు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. బంధువుల్లో ఒకరి నుంచి ధర సహాయము అందడం వల్ల వ్యాపారులు కొత్త ప్రాజెక్టులను చేపడుతారు. జీవిత భాగస్వామితో ఏదైనా వ్యాపారం చేయాల్సివస్తే ఇదే మంచి సమయం. కొత్త వ్యక్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. దీంతో శత్రువుల బెడద తగ్గుతుంది. విద్యార్థులు విదేశాలకు వెళ్లాలని చూస్తే వారు శుభవార్తను వింటారు. విహారయాత్రలకు వెళ్లడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్నేహితుల్లో ఒకరు కావలసిన సహాయాన్ని అందిస్తారు.