https://oktelugu.com/

Iron: ఇనుము తుప్పు పడుతుంది.. కానీ రైలు పట్టాలు ఎందుకు తుప్పు పట్టవు?

సాధారణ ఇనుము ఎండలో ఉన్నా, వర్షంలో తడిచిన తుప్పు పడుతుంది. కానీ రైలు పట్టాలు రోజూ ఎండలో ఉంటాయి. ఎన్నో భారీ వర్షాలకు తడుస్తాయి. కానీ తుప్పు పట్టవు. ఇనుము గాలిలోని ఆక్సిజన్‌తో చర్య జరుపుతుంది. దీనివల్ల ఇనుము తొందరగా తుప్పు పడుతుంది. మరి రైలు పట్టాలు ఎందుకు తుప్పు పట్టకుండా ఉంటాయో.. తెలియాలంటే ఆలస్యం చేయకుండా స్టోరీ మొత్తం చదివేయండి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 7, 2024 / 04:55 AM IST

    railway tracks

    Follow us on

    Iron: సాధారణంగా అందరి ఇంట్లో ఇనుము ఉంటుంది. ఏదో ఒక దానికి వాడుతుంటారు. అయితే ఈ ఇనుముని ఖాళీగా ఉంచితే అది తుప్పు పడుతుంది. సాధారణంగా ఇంటి గేటుకి ఇనుము వాడుతారు. వాటికి పెయింట్ వేస్తే తుప్పు పట్టదు. వేయకుండా అలాగే వదిలేస్తే అవి తొందరగా తుప్పు పడతాయి. అయితే రైళ్లు పట్టాలు ఇనుముతోనే ఉంటాయి. దేశ వ్యాప్తంగా రైళ్లు ఉన్నాయి. వీటి కోసం చాలా మొత్తంలో ఇనుము వాడారు. కానీ ఎక్కడ కూడా తుప్పు పట్టవు. సాధారణ ఇనుము ఎండలో ఉన్నా, వర్షంలో తడిచిన తుప్పు పడుతుంది. కానీ రైలు పట్టాలు రోజూ ఎండలో ఉంటాయి. ఎన్నో భారీ వర్షాలకు తడుస్తాయి. కానీ తుప్పు పట్టవు. ఇనుము గాలిలోని ఆక్సిజన్‌తో చర్య జరుపుతుంది. దీనివల్ల ఇనుము తొందరగా తుప్పు పడుతుంది. మరి రైలు పట్టాలు ఎందుకు తుప్పు పట్టకుండా ఉంటాయో.. తెలియాలంటే ఆలస్యం చేయకుండా స్టోరీ మొత్తం చదివేయండి.

    రైలు పట్టాలపై ఉండే ఇనుమును ప్రత్యేకంగా తయారు చేస్తారు. దీన్నే మాంగనీస్ స్టీల్ అని అంటారు. ఇందులో 0.8% కార్బన్ ఉండటంతో పాటు 12% మాంగనీస్ ఉంటుంది. ఈ లోహాలు ఉండటం వల్ల రైలు పట్టాలకు ఉండే ఇనుము తుప్పు పట్టదు. ఈ లోహాల వల్ల పట్టాలపై ఐరన్ ఆక్సైడ్ ఏర్పడదు. దీంతో అవి తుప్పు పట్టకుండా ఉంటాయి. సాధారణ ఇనుము వర్షంలో తడిచిన, ఎండలో ఉన్నా కూడా తుప్పు పడతాయి. కానీ మాంగనీస్‌ స్టీల్‌తో తయారు చేసిన ఇనుము తొందరగా తుప్పు పట్టదు. ఎక్కువ కాలం ఇవి మన్నిక వస్తాయి.

    కొన్ని సందర్భాల్లో రైల్వే ట్రాక్‌లు కూడా తుప్పు పడతాయి. ఈ ప్రపంచంలో ప్రతి వస్తువుకి ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. అలాగే ఎక్కువగా వాడితే మాంగనీస్ స్టీల్‌ అయిన కూడా దెబ్బతింటుంది. అలాగే కొన్నిసార్లు రైల్వే ట్రాక్‌లు కూడా దెబ్బతింటాయి. ట్రాక్‌లు కొన్నిసార్లు నీరు, ఆక్సిజన్ చర్య కారణంగా దెబ్బతింటాయి. ఇవే కాకుండా తేమ, వర్షం, మంచు, ఉప్పు నీరు వంటి వాటి వల్ల కూడా తుప్పు పడతాయి. అయితే తుప్పులు పట్టకుండా ఉండాలంటే వాటిపై ఏదో ఒక పూత వేయాలి. లేకపోతే పెయింట్ వేయాలి. ఎలాంటి తేమ వంటివి చేరి ఆక్సీకరణం జరగకుండా చూసుకోవాలి. అయితే తుప్పు పట్టిన వాటిని గుర్తించడానికి రైల్వే శాఖ ఎప్పటికప్పుడు ట్రాక్‌లను తనిఖీ చేస్తాయి. చూడటం, అల్ట్రాసోనిక్ పరీక్ష, మాగ్నెటిక్ పార్టికల్ ఇన్స్పెక్షన్ వంటి నాన్-డిస్ట్రక్టివ్ టెస్టింగ్ టెక్నిక్‌లను ఉపయోగించి తుప్పు పట్టాయో లేదో గుర్తిస్తారు.