Tamilnadu
Temples: భారత దేశంలో హిందూ సంప్రదాయానికి ఓ ప్రత్యేకత ఉంది. హిందూ సంప్రదాయాన్ని పూజించే వారు ఎక్కువగా ఆలయాలకు వెళ్తుంటారు. దేశంలో ఎన్నో హిందూ ఆలయాలు ఉన్నాయి. ప్రతీ ఏటా చాలా మంది ఈ ఆలయాలను సందర్శిస్తుంటారు. ఎంతో భక్తితో ఆలయాలను సందర్శిస్తారు. ఎంతో ప్రాముఖ్యత కలిగి ఆలయాలను జీవితంలో ఒక్కసారైన దర్శించాలని భావిస్తారు. ఆలయాలకు వెళ్తే ప్రశాంతంగా ఉండటమే కాకుండా వాటిని చెక్కిన విధానం కూడా చాలా బాగుంటుంది. అయితే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఆలయాలు ఉన్నాయి. ఎన్నో వేల సంవత్సరాల నాటి క్రితం ఆలయాలు కూడా ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే దేశంలో ఒక రాష్ట్రంలో అత్యధికంగా ఆలయాలు ఉన్నాయి. ఇంతకీ ఆ రాష్ట్రం ఏది? ఎన్ని ఆలయాలు ఉన్నాయో? తెలియాలంటే స్టోరీ మొత్తం పూర్తిగా చదివేయండి.
భారత దేశంలో తమిళనాడులో ఎక్కువగా ఆలయాలు ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రాన్ని దేవాలయాల భూమి అని కూడా పిలుస్తారు. తమిళనాడులో దాదాపుగా 79వేల ఆలయాలు ఉన్నాయి. కేవలం హిందూ ఆలయాలు మాత్రమే కాకుండా బౌద్ధ, జైన మతాలకు సంబంధించిన ఆలయాలు కూడా ఉన్నాయి. ఎన్నో వేల ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. వేల ఏళ్లు అయిన కూడా ఇప్పటికీ ఆ ఆలయాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. తమిళనాడులో ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో మీనాక్షి అమ్మ వారు మదురై, ఆది కుంబేశ్వరర్ కుంభకోణం, బృహదీశ్వరాలయం తంజావూరు, శ్రీ రంగనాథస్వామి దేవాలయం శ్రీరంగం, శ్రీ రాజగోపాల స్వామి దేవాలయం మన్నార్గుడి, జంబుకేశ్వర ఆలయం, తిరువాన్నమళై, కంచి కైలాసనాథర్ ఆలయం కాంచీపురం, ఏకాంబరేశ్వర ఆలయం కాంచీపురం, రామనాథస్వామి దేవాలయం రామేశ్వరం, మయూరనాథస్వామి ఆలయం మైలాడుతురై, కపాలీశ్వర ఆలయం చెన్నై, ఏకశిలా రాతి దేవాలయాలు మహాబలిపురం, పాపనాశం దేవాలయం తిరునెల్వేలి వంటి ఆలయాలు ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా చాలా ఆలయాలు ఉన్నాయి. వీటిని చూడటానికి రెండు కళ్లు కూడా సరిపోవు. ఎందుకంటే ఈ టెంపుల్స్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంటాయి. ఎలాంటి టెక్నాలజీ లేని రోజుల్లోనే అంత అందమైన ఆర్కిటెక్చర్‌తో వాటిని నిర్మించారు.
జీవితంలో ఒక్కసారైన ఈ టెంపుల్స్‌ను చూడాల్సిందే. చూడటానికి ఎంతో అందంగా ఉండే ఈ టెంపుల్స్‌ను చూడటానికి చాలా మంది వెళ్తుంటారు. దేశంలో ఎన్నో అందమైన ఆలయాలు ఉన్నాయి. కానీ తమిళనాడులో ఉండే టెంపుల్స్ చాలా ప్రత్యేకమైనవి. ఈ టెంపుల్స్‌ను చూడటానికి కొందరు ఎంతో ప్లాన్ చేసి వెళ్తుంటారు. ఏడాదికి ఒక్కసారైన ప్లాన్ చేసుకుని కొన్ని టెంపుల్స్‌ను చూసి వస్తుంటారు. మరి మీరు ఎప్పుుడైనా తమిళనాడు వెళ్లారా? అక్కడ టెంపుల్స్ ఏవైనా చూశారా? చూస్తే ఏ టెంపుల్స్ చూశారో కామెంట్ చేయండి.