Homeఆంధ్రప్రదేశ్‌Vijayawada Utsav 2.0: నరేంద్ర మోడీ కీలక ప్రకటన.. పాపం జగన్.. కాస్త గ్యాప్ ఇవ్వండి...

Vijayawada Utsav 2.0: నరేంద్ర మోడీ కీలక ప్రకటన.. పాపం జగన్.. కాస్త గ్యాప్ ఇవ్వండి చంద్రబాబు సార్..

Vijayawada Utsav 2.0: ఆధ్యాత్మికంగా.. చారిత్రాత్మకంగా.. కళల పరంగా.. ఆధునిక అభివృద్ధి కోణంలో.. ఈ నాలుగింటి సమహారంగా దుర్గమ్మ కొలువు దీరిన నగరిలో రెండో ఎడిషన్ ఉత్సవ్ జరగనుంది. ఒక నగరంలో ఉత్సవాలు నిర్వహించడం అనేది పెద్ద విషయం కాదు. కానీ నగరం చరిత్రను.. సంప్రదాయాలను.. స్థానిక ప్రతి ప్రపంచానికి చూపించడం అనేది మామూలు విషయం కాదు. పైగా దానికి ఒక వేదికను సృష్టించడం.. ఉత్సవం లాగా తీర్చిదిద్దడం మాత్రం భిన్నమైన ఆలోచన. విజయవాడ ఉత్సవ్ రెండో ఎడిషన్ […]

Vijayawada Utsav 2.0: ఆధ్యాత్మికంగా.. చారిత్రాత్మకంగా.. కళల పరంగా.. ఆధునిక అభివృద్ధి కోణంలో.. ఈ నాలుగింటి సమహారంగా దుర్గమ్మ కొలువు దీరిన నగరిలో రెండో ఎడిషన్ ఉత్సవ్ జరగనుంది. ఒక నగరంలో ఉత్సవాలు నిర్వహించడం అనేది పెద్ద విషయం కాదు. కానీ నగరం చరిత్రను.. సంప్రదాయాలను.. స్థానిక ప్రతి ప్రపంచానికి చూపించడం అనేది మామూలు విషయం కాదు. పైగా దానికి ఒక వేదికను సృష్టించడం.. ఉత్సవం లాగా తీర్చిదిద్దడం మాత్రం భిన్నమైన ఆలోచన. విజయవాడ ఉత్సవ్ రెండో ఎడిషన్ దాదాపు ఇటువంటి లక్ష్యంతోనే ముందుకు సాగుతోంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు

ఈ ఉత్సవాన్ని అభినందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీ ప్రభుత్వానికి ఒక లేఖ కూడా పంపించారు. ఆయన ఇటీవల కాలంలో ఒక రాష్ట్రంలో నిర్వహించే ఉత్సవాల సంబంధించి అభినందిస్తూ లేఖ రాయడం ఇదే తొలిసారి. ఆయన చేసిన వ్యాఖ్యలు.. సగటు విజయవాడ వాసులకు మాత్రమే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆనందాన్ని కలుగజేసాయి. విజయవాడ నగర సాంస్కృతిక వారసత్వం.. పర్యాటక నేపథ్యం.. స్థానికంగా లభించే ఉపాధి.. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ లేఖలో ప్రస్తావించారు.

ఈ ఉత్సవాన్ని ప్రారంభ వేడుకల వైభవంతో లేదా ప్రముఖుల అభినందనలతో తూకం వేయలేం. ఈ వేడుక ద్వారా ఎంత గుర్తింపు వచ్చింది.. స్థానికంగా ఉండే కళాకారులకు ఏ స్థాయిలో మేలు కలగజేసింది.. వ్యాపారులకు ఎలాంటి అవకాశాలను అందించింది.. పర్యాటకులకు ఏ స్థాయిలో అనుభూతి కలిగింది.. అనే అంశాలనే ఏపీ ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటున్నది.

విజయవాడ నగరానికి అద్భుతమైన ప్రత్యేకత ఉంది. ఇక్కడ అమ్మలగమ్మ అమ్మ ద్వారా భక్తి.. వ్యాపారుల ద్వారా వాణిజ్యం.. కృష్ణా నది ద్వారా సంస్కృతి ఒకే చోట కలగలిసిపోయాయి. ఇంతటి విశిష్టతను మరింత బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పది రోజులపాటు ఈ వేడుకలు నిర్వహిస్తారు. సంస్కృతిక దర్శనం.. సంగీత కళాకారుల ఆధ్వర్యంలో సంగీత కార్యక్రమాలు.. జానపద కళాకారుల ఆధ్వర్యంలో జానపద ప్రదర్శనలు.. క్రీడాకారుల విన్యాసాలు.. కార్ని వాల్ వంటి వాటికి అవకాశం కల్పించారు.

విజయవాడ నగరానికి గ్లోబల్ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక రకాలుగా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నారు. విజయవాడ ఉత్సవ్ కార్యక్రమానికి దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రిలను.. రాష్ట్రపతిని.. ప్రధానమంత్రి ఆహ్వానించారు. ఇప్పటికే విజయ్ వస్తానని చెప్పారు. మిగతా ముఖ్యమంత్రులు కూడా హాజరవుతారు. ప్రధానమంత్రి ఏకంగా లేఖ రాశారు. దీనిని బట్టి జగన్ పరిపాలనలో ఏపీ ఏం కోల్పోయింది.. తన పరిపాలనలో ఏం సాధించింది.. ఈ విషయాలను చంద్రబాబు అందరికీ అర్థమయ్యే విధంగా చెబుతున్నారు. ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా జగన్ కు మాస్టర్ స్ట్రోక్లు ఇస్తున్నారు. రాజకీయమంటే ప్రత్యర్థి మీద ప్రత్యక్షంగా దాడి చేయడం కాదు.. వచ్చిన అవకాశాల ఆధారంగా ప్రత్యర్థికి ఊపిరి ఆడకుండా చేయడమే.. ప్రస్తుతం చంద్రబాబు చేస్తున్నారు.. జగన్ మాస్టర్ స్ట్రోక్ లతో ఇబ్బంది పడుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper