Vijaya Dasami 2024: దసరా రోజు ఈ పనులు చేస్తే అన్నింట్లో విజయం తథ్యం.. ఇంతకీ ఆ పని ఏంటంటే?

దసరా పండుగ రోజు కొన్ని పనులు చేస్తే ఏ పని మొదలు పెట్టిన అన్ని విజయాలే లభిస్తాయి. తెలియకుండా చిన్న తప్పులు చేయకుండా ఈ ముఖ్యమైన పనులు చేస్తే ఆటంకం లేకుండా ప్రతీ విషయంలో విజయం సిద్ధిస్తుందట. మరి దసరా రోజూ చేయాల్సిన ఆ పనులు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By: Kusuma Aggunna, Updated On : October 11, 2024 5:52 pm

Vijaya Dasami 2024

Follow us on

Vijaya Dasami 2024: హిందూ పండుగల్లో దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా దసరా వేడుకలను అందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారి నవరాత్రుల పూజించిన తర్వాత పదవ రోజు అనగా దశమి రోజు దసరా పండుగను ఘనంగా జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఈ పండుగ రోజు కొత్త దుస్తులు ధరించి ఎంతో వేడుకగా ఈ దసరా పండుగను జరుపుకుంటారు. అన్ని కష్టాలు తొలగి సుఖ శాంతిలతో హాయిగా ఉండాలని ప్రతీ ఒక్కరూ దుర్గాదేవిని పూజిస్తారు. అయితే కొందరు తెలియక దసరా పండుగ రోజు కొన్ని తప్పులు చేస్తుంటారు. పండుగ రోజు కొన్ని పనులు చేస్తే ఏ పని మొదలు పెట్టిన అన్ని విజయాలే లభిస్తాయి. తెలియకుండా చిన్న తప్పులు చేయకుండా ఈ ముఖ్యమైన పనులు చేస్తే ఆటంకం లేకుండా ప్రతీ విషయంలో విజయం సిద్ధిస్తుందట. మరి దసరా రోజూ చేయాల్సిన ఆ పనులు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

 

చెడును జీవితం నుంచి తొలగించి మంచిని ఆహ్వానించడమే దసరా ప్రాముఖ్యత. ఈ పండుగ రోజు అయిన ఎలాంటి చెడు అలవాట్లు అలవాటు చేసుకోకుండా దూరంగా ఉండాలని పండితులు చెబుతారు. అయితే దసరా పండుగ రోజు కొన్ని పనులు చేయడం వల్ల అదృష్టం వరిస్తుందని పండితులు చెబుతున్నారు. రావణాసురుడిపై యుద్ధం చేయడానికి వెళ్లే ముందు రాముడు పాలపిట్టను చూసి వెళ్లడట. ఇలా చూసి వెళ్లడం వల్లే యుద్ధంలో విజయం సాధించాడని పురాణాలు చెబుతున్నాయి. దసరా పండుగ రోజు ఎవరైతే పాలపిట్టను చూస్తారో వారికి లాభాలు రావడంతో పాటు ప్రతి పనిలో విజయం సాధిస్తారని ప్రజలు నమ్ముతారు. అయితే పాలపిట్టను చూడటానికి ఇంకో స్టోరీ ఉందట. పాండవులు అరణ్య వాసం ముగించుకుని ఆయుధాలు తీసుకుని వెళ్తుండగా పాలపిట్ట వారికి ఎదురైంది. ఆ తర్వాత వారికి కౌరవులతో జరిగిన యుద్ధంలో విజయం సాధించారని.. అందుకే పాలపిట్ల చూస్తారని చెబుతారు. పాలపిట్టను చూసి ఏ పనిని ప్రారంభించిన విజయం లభిస్తుందని ప్రజలు నమ్ముతారు.

 

దసరా పండుగ రోజు చీపురును దానం చేయడం వల్ల మంచి జరుగుతుందని చాలా మంది నమ్ముతారు. ఈ రోజున చీపురు దానం చేస్తే అన్ని విధాలుగా శుభప్రదంగా ఉంటుందని ప్రజలు భావిస్తారు. అలాగే ఈరోజు అపరాజిత వృక్షాన్ని కూడా పూజిస్తారు. చేయడం వల్ల జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. డబ్బు సంబంధిత విషయాల్లో సమస్యలు ఎక్కువగా ఉంటే.. దసరా పండుగ రోజు నుంచి 43 రోజుల పాటు కుక్కకు ఆహారం పెట్టాలని పండితులు చెబుతున్నారు. అలాగే దసరా పండుగ రోజు కొబ్బరి కాయను తల చుట్టూ 21 సార్లు తిప్పి రావణాసురుడి దిష్టి బొమ్మతో కాల్చాలి. ఇలా చేయడం వల్ల సకల రోగాలు నయమవుతాయని ప్రజలు నమ్ముతారు. పండుగ రోజు శమీ చెట్టుని పూజిస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. దసరా పండుగ సాయంత్రం రోజున శమీ వృక్షం దగ్గర దీపం పెట్టి పూజ చేయడం వల్ల పనిలో విజయం, జీవితంలో అన్ని సానుకూల ఫలితాలు లభిస్తాయని ప్రజలు నమ్ముతారు.

 

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు పండితుల సూచనలు తీసుకోగలరు.