Mens extinct: ఆడవాళ్లతోనూ ఉండలేరు, వాళ్లను విడిచి కూడా పురుషులు ఉండలేరు. అసలు అమ్మాయిలు లేని ప్ర్రదేశం ఎక్కడుందని పురుషులు ఎక్కువగా చూస్తుంటారు. పూర్తిగా అమ్మాయిలు లేకపోతే బాగుంటాదని భావిస్తారు. ఇదిలా ఉండగా.. భవిష్యత్తులో భూమిపై మగవాళ్లు అంతరించిపోతారని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొన్నాళ్ల మాత్రమే పురుషులు భూమిపై ఉంటారని, ఆ తర్వాత మహిళలు మాత్రమే భూమిపై ఉంటారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మగవాళ్లు ఇకపై భూమిపై ఉండరని ఎలుకలపై చేసిన ప్రయోగంలో పరిశోధకులు తెలిపారు. జపాన్‌లోని ఓ దీవి అంతరించిపోతుందనే విషయంపై అధ్యయనం చేస్తూ.. అందులో ఉన్న ఎలుకలపై పరిశోధనలు చేశారు. సాధారణంగా ఎలుకలు అంత తొందరగా అంతరించవు. కానీ ఈ పరిశోధనల్లో ఎలుకల్లో Y క్రోమోజోమ్ లేదని విషయం వారికి తెలిసింది. ఎలుకలు తొందరగానే వారి సంతానోత్పత్తిని పెంచుకుంటాయి. కానీ ఈ పరిశోధనలో మాత్రం అసలు ఎలుకలు కనిపించలేదు.
పురుషుల్లో Y క్రోమోజోమ్‌లు సంఖ్య తగ్గితే కొన్ని మిలియన్ల సంవత్సరాల తర్వాత ఈ భూమిపై మగవాళ్లు ఉండటం కష్టమే. ఇప్పటికే పురుషులు వీర్యకణాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆహారంలో మార్పులు, జీవనశైలి వంటి వాటివల్ల చాలా మంది పురుషులు ఈ మధ్యకాలంలో స్పెర్మ్ కౌంట్‌తో ఇబ్బంది పడుతున్నారు. కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పురుషులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. సరైన విశ్రాంతి లేకుండా పని, వ్యాయామం లేకపోవడం, నిద్ర లేకపోవడం, ఆల్కహాల్ సేవించడం, ధూమపానం సేవించడం వంటి అలవాట్ల స్పెర్మ్ కౌంట్‌తో పాటు నాణ్యతతో కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇకనైనాన జాగ్రత్త వహించకపోతే పురుషులు అంతరించడమే ఆలస్యం అని చెప్పవచ్చు.
మానవుల్లో మొత్తం 23 జతల క్రోమోజోమ్‌లు ఉంటాయి. ఇందులో 22 జతల ఆటోసోమ్‌లు ఉంటాయి. ఇందులో ఒక జత అలోసోమ్‌లు లేదా లింగ క్రోమోజ్‌లు ఉంటాయి. అయితే మానవులలో రెండు రకాల లింగ క్రోమోజోములు ఉంటాయి. మహిళల్లో XX క్రోమోజోమ్‌లు ఉంటే.. మగవారిలో XY క్రోమోజోమ్‌లు ఉంటాయి. ఆడవారి నుంచి X క్రోమోజోమ్.. మగవారి X క్రోమోజోమ్ కలిస్తే ఆడపిల్ల పుడుతుంది. అదే మగవారి నుంచి Y క్రోమోజోమ్, ఆడవారి X క్రోమోజోమ్‌తో కలిస్తే అబ్బాయి పుడతాడు. పురుషుల్లో వచ్చే Y క్రోమోజోమ్ ఇప్పుడు పూర్తిగా క్షీణిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇది మానవ మనుగడపై ప్రభావ పడుతుందని పరిశోధకులు ఆందోళన చెందుతున్నారు. శారీరక ఆరోగ్యంగాతో మానసికంగా ఆరోగ్యంగా లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. అలాగే పురుషులు అంగస్తంభన సమస్యతో కూడా ఎక్కువగా ఇబ్బంది పడటం దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ జనరేషన్‌లో పురుషలు సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, ఎక్కువగా అంగస్తంభన చేయడం కూడా ఓ కారణం. ఇప్పటికే చాలా దేశాల్లో ఈ పురుషులు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. వారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గడం వల్ల పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువగా ఉంటున్నాయి. దీనికి తోడు పురుషుల క్రోమోజోములు తగ్గిపోతే ఇంకే అంతే సంగతులు.