Varudhini Ekadhasi : ప్రతీ నెలలో రెండు ఏకాదశిలు వస్తుంటాయి. చైత్రమాసంలో వచ్చే ఏకాదశిని వరూధిని అంటారు. 2024 సంవత్సరంలో మే 4వ తేదీన వరూధిని ఏకాదశిని జరుపుకోనున్నారు. పురాణాల ప్రకారం ఈరోజు భక్తి శ్రద్ధలతో ఉండి శ్రీ మహా విష్ణువును పూజించడం వల్ల అన్నీ శుభాలే జరుగుతాయని అంటున్నారు. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి వ్రతాన్ని ఆచరించడం వల్ల జీవితంలో ఉన్న దు:ఖాలు తొలగిపోతాయని చెబుతున్నారు. అయితే వరూథిని ఏకా దశి రోజు కొన్ని పనులు చేయాలి. మరికొన్ని పనులు పొరపాటున కూడా చేయొద్దని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే?
శ్రీ మహా విష్ణువు అవతారాల్లో వరహం ఒకటి. వరూథిని ఏకాదశి రోజున వరహ మూర్తిని పూజించడం వల్ల అన్నీ శుభాలే జరుగుతాయి. ఈరోజున సూర్యోదయం ముందే స్నానమాచరించాలి. కొత్త దుస్తులు ధరించి వ్రతమాచరించాలి. ఈ వ్రతాన్ని ద్వాదశ తిథి మగిసేలోపే పూర్తి చేయాలి. సకల సంపదలకు అధినేత అయిన విష్ణువును ధ్యానిస్తూ సాత్విక ఆహారం తీసుకోవాలి. ఈరోజు తప్పనిసరిగా శ్రీమత్ భగవత్ గీతాన్ని పఠించాలి. విష్ణు మంత్రాలను చదవడం మరీ మంచిది.
ఇక ఈరోజు కొన్ని పనులను అస్సలు చేయకుండా ఉండాలి. వరూథిని ఏకాదశి రోజు తులసి దళాలు తెంపకూడదు. అయితే విష్ణు పూజ కోసం తులసి దళాలు అవసరం. అందువల్ల ఒకరోజు ముందే తెంపి మంచి ప్రదేశంలో ఉంచండి. తల స్నానం చేసేటప్పుడు షాంపు పెట్టుకోవద్దు. మాంసం జోలికి పోకుండా ఉండలి. వెల్లుల్లి, ఉల్లిపాయలకు దూరంగా ఉండాలి. నూనెలో వాడిన ఆహారాన్ని తీసుకోకుండా జాగ్రత్త పడాలి. చిక్కుళ్లు, ధాన్యాలు కూడా తీసుకోవద్దు.
అన్ని రకాల భయాలు తొలగిపోవాలంటే వరూతిని ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వల్ల ఫలితం ఉంటుంది. ఈరోజు మొత్తం శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడినందున ఆయన అనుగ్రహం పొందాలంటే కొన్ని నియమాలు పాటించాలి. ఈ నియమాలు పాటిస్తూ వ్రతం చేయడం వల్ల జీవితంలో అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి.