Chandrababu: చంద్రబాబు పొలిటికల్ సక్సెస్ వెనుక అనేక కారణాలు ఉంటాయి.ఆయన చివరి వరకు పోరాడుతారు. ఓటమి ఎదురైన ప్రతీసారి నిలబడేందుకు ఆయన చేసే ప్రయత్నం అభినందనీయం. రెండుసార్లు పార్టీకి ఓటమి ఎదురైనా.. సీనియర్లు దూరమైనా వీరోచిత పోరాటం చేసి 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురయ్యేసరికి.. పార్టీ ఇక లేవదని అంతా భావించారు. కానీ ధైర్యం కూడగట్టి.. ఏడుపదుల వయసులో గట్టిగానే పోరాడుతున్నారు. ఒకవైపు పొత్తులు, మరోవైపు ప్రత్యర్థి పై వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు.
గత ఎన్నికల్లో వైయస్ వివేకానంద రెడ్డి హత్య అంశం కుదిపేసింది. వైసీపీకి రాజకీయంగా లబ్ధి చేకూరింది. ఇప్పుడు అదే అంశాన్ని తీసుకుని చంద్రబాబు పోరాటం చేయడం ప్రారంభించారు. వైయస్ కుటుంబంలో వ్యక్తుల ద్వారానే గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా షర్మిల వివేక హత్య అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తుండగా.. సునీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హత్య అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. అటు పవన్ తో పాటు చంద్రబాబు సైతం వివేక హత్య అంశాన్ని ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు.బాబాయిని చంపించిన వాడు.. ప్రజలను లెక్క చేస్తాడా అంటూ ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాల కంటే వివేక హత్య అంశమే ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు వివేక హత్యకేసుకు సంబంధించి.. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూన్యాయస్థానాన్ని ఆశ్రయించేలా కొందరిని చంద్రబాబు ప్రోత్సహించారు. అందులో భాగంగానే దస్తగిరి సైతం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఎలాగైనా పోలింగ్కు ముందు అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయిస్తే.. జగన్ కు అష్టదిగ్బంధం చేయవచ్చని చంద్రబాబు భావించారు. అందుకే కోర్టును ఆశ్రయించారు. అయితే తాజాగా ఈ బెయిల్ పిటిషన్ అంశాన్ని తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. దీంతో చంద్రబాబు చివరి అస్త్రంగా ఉన్న అవినాష్ రెడ్డి బెయిల్ అంశంవర్కౌట్ కాలేదు. అయితే చంద్రబాబు ఇంతటితో ఊరుకుంటారా? అంటే లేదనే సమాధానం వస్తోంది. చివరి వరకు పోరాడడం చంద్రబాబు నైజం. అందులో సక్సెస్ ఫుల్ ఫలితాలకు అలవాటు పడిన చంద్రబాబు తదుపరి పోరాటాన్ని కూడా కొనసాగిస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.