https://oktelugu.com/

Force Gurkha: మార్కెట్లోకి దిగిన ఫోర్స్ ‘గుర్ఖా’ ఎస్ యూవీ.. ధర చూస్తే షాక్ అవుతారు..

కొత్తగా ఏర్పాటు చేసిన అల్లాయ్ వీల్స్, హెడ్ లైల్ తో పాటు గ్రిల్స్ ఈ మోడల్ కు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇది 3, 5 డోర్ల వేరియంట్ లను కలిగి ఉన్నాయి. ఇక సేప్టీ విషయానికొస్తే ఈ కారులో డ్యూయెల్ ఎయిర్ బ్యాగ్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : May 3, 2024 / 03:46 PM IST

    Force Gurkha

    Follow us on

    Force Gurkha:  కార్లకు డిమాండ్ పెరుగుతుండడంతో కొత్త కొత్త మోడళ్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఎస్ యూవీ కార్లకు ఎక్కువగా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఫోర్స్ నుంచి ‘గుర్ఖా’ రిలీజ్ అయింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఎస్ యూవీలైన మహీంద్రా థార్, మారుతి జిమ్నీలకు ఇది గట్టి పోటీ ఇవ్వనుందని అంటున్నారు. ఈ కారు బుకింగ్ లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

    ప్రముఖ కార్ల కంపెనీ ఫోర్స్ తాజాగా కొత్త మోడల్ ను 2024 మే 3న శుక్రవారం విడుదల చేసింది. గతంలో ఉన్న గూర్ఖా ను అప్డేట్ చేసి అధునాతన ఫీచర్లు, టెక్నాలజీని అమర్చి.. డిజైన్ లో కూడా మార్పులు చేసి రిలీజ్ చేశారు. ఈ మోడల్ ఫీచర్ల విషయానికొస్తే కొత్త ఆఫ్ హోల్డరీతో పాటు కంప్లీట్ డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్ ను అందిస్తుంది. ఆఇందులో 8.0 అంగుళాల డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ సిస్టమ్ డిస్ ప్లే వంటి ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి.

    కొత్తగా ఏర్పాటు చేసిన అల్లాయ్ వీల్స్, హెడ్ లైల్ తో పాటు గ్రిల్స్ ఈ మోడల్ కు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇది 3, 5 డోర్ల వేరియంట్ లను కలిగి ఉన్నాయి. ఇక సేప్టీ విషయానికొస్తే ఈ కారులో డ్యూయెల్ ఎయిర్ బ్యాగ్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. దీనిని రూ.16.75 లక్షల ప్రారంభ ధరతో సంస్థ విడుదల చేసింది. 3 డోర్, 5 డోర్ అనే వెరియంట్ల ధరలో మార్పులు ఉండొచ్చు. అంతేకాకుండా ఆన్ రోడ్ లో ఈ మోడల్ ధర కూడా పెరిగే అవకాశం ఉంది.

    గుర్ఖా ఇంజిన్ విషయానికొస్తే ఇందులో 2.6 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంది. 132 బీహెచ్ పీ పవర్, 320 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో ఉండే ఈ మోడల్ లో 4 వీల్ డ్రైవ్ ఆప్షన్, లాకింగ్ డిఫరెన్సియల్ ను కలిగి ఉంది. ఆన్ రోడ్ కంటే ఆప్ రోడ్ కొచ్చేసరికి డ్రైవర్లు దీనిని బాగా ఇష్టపడుతారని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. కాగా ఈ కారు బుకింగ్ ప్రారంభం కావడంతో చాలా మంది కారు సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.