https://oktelugu.com/

Ugadi Panchangam 2025: ఉగాది పంచాంగం: ఎవరి ఆదాయ వ్యయాలెంత? జాతకాలు ఎలా ఉన్నాయంటే?

Ugadi Panchangam 2025 వీరికి ఈ ఏడాది మంచి సమయం. అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. ఆర్థిక సమస్యలు అన్ని కూడా తీరిపోతాయి. ఈ ఏడాది వీరికి అదృష్టయోగం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది.

Written By: , Updated On : March 30, 2025 / 12:24 PM IST
Ugadi Panchangam 2025

Ugadi Panchangam 2025

Follow us on

Ugadi Panchangam 2025: కొత్త ఏడాది శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగు పెట్టాం. అయితే ఈ ఉగాది నాడు అందరూ కూడా తప్పకుండా పంచాంగం చూసుకుంటారు. అయితే మరి ఈ ఏడాది ఏయే రాశుల వారి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో ఈ స్టోరీలో చూద్దాం.

మేషం
అవమానం 7 రాజపూజ్యం 5 ఆదాయం 2 వ్యయం 14
ఈ రాశి వారికి ఈ ఏడాది అంతా కూడా శుభమే జరుగుతుంది. అనుకున్న పనులు అన్ని కూడా జరుగుతాయి. ఆదాయం ఉంటుంది. కానీ ఖర్చులు కూడా అలానే ఉంటాయి. డబ్బుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. పొదుపు చేయాలి.

వృషభం
రాజపూజ్యం 1, అవమానం 3 ఆదాయం 11 వ్యయం 5
వీరికి ఈ ఏడాది మంచి సమయం. అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. ఆర్థిక సమస్యలు అన్ని కూడా తీరిపోతాయి. ఈ ఏడాది వీరికి అదృష్టయోగం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది.

మిథునం
రాజపూజ్యం 4 అవమానం 3 ఆదాయం 14 వ్యయం 2
ఆ ఏడాది వీరికి ఆదాయం బాగుంటుంది. ఆర్థిక సమస్యలు ఉండవు. సమాజంలో కీర్తీ ప్రతిష్టలు పెరుగుతాయి. వీరికి కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం
రాజపూజ్యం 7 అవమానం 3 ఆదాయం 8, వ్యయం 2
వీరి ఈ ఏడాది ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. అదృష్ట యోగం నడుస్తోంది. ఆత్మ బలంతో ఉంటే అన్ని కూడా విజయాలను తెచ్చిపెడుతుంది.

సింహం
రాజపూజ్యం 3 అవమానం 6 ఆదాయం 11 వ్యయం 11
వీరికి ఆదాయంతో పాటు ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఆత్మబలంతో సమస్యలు పరిష్కరించుకుంటారు. అలాగే అవమానాలు ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

కన్య
రాజపూజ్యం 6 అవమానం 6 ఆదాయం 14 వ్యయం 2
వీరి అదృష్ట కాలం అని చెప్పవచ్చు. ఏ పని చేపట్టినా కూడా విజయమే లభిస్తుంది. అయితే ఖర్చులు అవుతాయి. కాస్త పొదుపు చేయడం మంచిది.

తుల
రాజపూజ్యం 2 అవమానం 2 ఆదాయం 11 వ్యయం 5
వీరి ఇకపై అన్ని కూడా మంచి రోజులే. ఆదాయం, అదృష్టం ఇలా అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. అన్నింట్లో విజయాలను పొందుతారు.

వృశ్చికం
రాజపూజ్యం 5 అవమానం 2 ఆదాయం 2 వ్యయం 14
కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం తక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఖర్చులు ఉంటాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

ధనుస్సు
రాజపూజ్యం 1, అవమానం 5 ఆదాయం 5 వ్యయం 5
వీరికి ఈ ఏడాది ఎంత వచ్చినా కూడా ఖర్చు అవుతుంది. మంచి కాలమే.. ఎలాంటి సమస్యలు ఉండవు. అన్ని విధాలుగా కూడా బాగుంటుంది.

మకరం
రాజపూజ్యం 4 అవమానం 5 ఆదాయం 8 వ్యయం 14
వీరికి ఈ ఏడాది అంతా కూడా బాగుంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. అంతా కూడా మంచే జరుగుతుంది. సమస్యలు అన్ని కూడా తీరిపోతాయి.

కుంభం
రాజపూజ్యం 7 అవమానం 5 ఆదాయం 8 వ్యయం 14
ఈ ఏడాది వీరి శ్రమకు తగిన ఫలితం అందుతుంది. అన్నింట్లో కూడా విజయం లభిస్తుంది. సంపద వృద్ధి చెందుతుంది.

మీనం
అవమానం 1 రాజపూజ్యం 3ఆదాయం 5 వ్యయం 5
వీరికి ఈ ఏడాది బాగుంది. దీంతో పాటు అలాగే సమస్యలు కూడా ఉన్నాయి. అయితే గురు అనుగ్రహం వల్ల అంతా కూడా బాగుంటుంది. ఆదాయం వచ్చినా కూడా ఖర్చు అలాగే అవుతుంది.

Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.