Snake : పాముల్లో గిరి నాగులు ప్రత్యేకమైనవి. ఇవి పది నుంచి 20 అడుగుల పొడవు పెరుగుతాయి. ఇవి సాధారణంగా జనాలు ఉండే ప్రాంతాల్లోకి రావు. దట్టమైన అడవుల్లోనే జీవిస్తుంటాయి. అయితే కొంతకాలంగా జనావాసాల్లోకి వస్తున్నాయి. గిరి నాగులు విషం ఉన్న పాములను.. విషం లేని పాములను కూడా చంపేస్తుంటాయి. దర్జాగా లాగించేస్తుంటాయి. అయితే ఈ పాములు సహజంగా జనాలు ఉండే ప్రాంతాలకు దూరంగా ఉంటాయి. ఇటీవల కాలంలో ఇవి జనాలు ఉండే ప్రాంతాల్లోకి వచ్చేస్తున్నాయి.. వీటిని చూసిన జనాలు భయకంపితులవుతున్నారు. దూరంగా పారిపోతున్నారు.. ఇటీవల గిరి నాగులు జనాలు ఉండే ప్రాంతాల్లోకి రావడం రావడం పెరిగిపోయింది.. స్నేక్ క్యాచర్ లను పిలిపించడం.. పాములను దట్టమైన అడవులు ఉండే ప్రాంతాలలో వదిలిపెట్టడం వంటివి పరిపాటిగా మారింది. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లాలో భారీ గిరినాగు ప్రత్యక్షమైంది.. ఇది దాదాపు 15 అడుగుల పొడవు ఉంది. దీనిని జంతు శాస్త్ర నిపుణులు కింగ్ కోబ్రా అని పిలుస్తుంటారు.. అయితే ఈ పామును చూసిన కుక్కలు అరవడంతో స్థానికంగా ఉన్న రైతులు అక్కడికి వెళ్లారు. రైతులను చూసిన గిరినాగు బుసలు కొట్టింది. రైతుల మీదకి దూకేందుకు ప్రయత్నించింది. ఆ తర్వాత పక్కన ఉన్న చెట్లలోకి వెళ్లిపోయింది.
Also Read : సమాధిలో అస్తిపంజరం కూర్చుంది.. వెలుగులోకి ఏళ్ల నాటి రహస్యం
అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు
గిరి నాగు ప్రత్యక్షం కావడం.. మళ్లీ వస్తుందేమోనని భయంతో రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వాస్తవానికి ఆ పామును చూస్తే అత్యంత భయంకరంగా కనిపించింది. దగ్గరగా చూసిన వాళ్లకు గుండెలు అదిరిపోయేలాగా కనిపించింది. ఈ పామును గిరి నాగు లేదా కింగ్ కోబ్రా అని పిలుస్తుంటారు. తూర్పుగోదావరి, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఎక్కువగా గిరి నాగులు కనిపిస్తుంటాయి. ఇవి పామాయిల్ తోటల్లో ఎక్కువగా తిరుగుతుంటాయి. ఇక గడిచిన వారం మాడుగుల – సాగరం రోడ్డు లోని తాచేరు వంతెన పై 12 అడుగుల గిరినవి కనిపించింది. ఆ పామును చూసిన స్థానికులు ఒక్కసారిగా భయకంపితులయ్యారు. స్నేక్ క్యాచర్ ను పిలిపించి పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఇంతలోనే ఆ నాగు సమీపంలో ఉన్న పామేల్ తోటలోకి వెళ్ళింది. ఆ తోటలో చెట్టును గట్టిగా చుట్టుకుంది. అక్కడికి స్నేక్ కేచర్ పెడుతున్నాడంతో బుసలు కొడుతూ మీదికి వచ్చింది. అయితే స్నేక్ క్యాచర్ వెంకటేష్ చాకచక్యంగా పామర్రు పట్టుకున్నాడు. పాడేరు ప్రాంతంలోని వంట్లమామిడి దగ్గర వదిలిపెట్టాడు. గిరి నాగులు విశాఖపట్నం జిల్లా ఏజెన్సీలో కూడా విపరీతంగా కనిపిస్తాయి. ఇది ఒకప్పుడు తూర్పు కనుమల్లోని అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేవి. విశాఖపట్నం జిల్లాలోని దేవరపల్లి చీడికాడ మండలంలో విపరీతంగా ఉంటాయి. తెలుగు పూడి అటవీ ప్రాంతం గిరి నాగులకు ప్రధాన ఆవాసంగా ఉంటుంది. ఈ పాములు మార్చి నుంచి జూన్ వరకు సంగమిస్తాయి. ఆడగిరి నాగులను ఆకర్షించడానికి మగ గిరి నాగులు విపరీతంగా ప్రయత్నిస్తుంటాయి. దీనికోసం ఆడగిరి నాగు ఫెరామిన్స్ అనే ఒక రసాయనాన్ని తన శరీరం నుంచి విడుదల చేస్తుందట. దానివల్ల మగ గిరి నాగులకు విపరీతమైన మైకం ఏర్పడుతుందట.. గిరి నాగులు నాగుపాములు, కట్లపాము, రక్తపొడ, జెర్రిగొడ్డు వంటి పాములను ఆహారంగా తింటాయి. ఈ పాములలో అత్యంత ప్రమాదకరమైన విషం ఉంటుంది. ఈ పాములు ఒక్కసారి కాటేస్తే మనుషులు వెంటనే చనిపోతారు. అందువల్లే దీనిని అత్యంత ప్రమాదకరమైన పాము అని జంతుశాస్త్ర నిపుణులు చెబుతుంటారు.
Also Read : కొత్త ఏడాది శుభాకాంక్షలు ఇలా చేప్పేయండి
అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో 15 అడుగుల భారీ గిరినాగు కలకలం
పొలాల్లో రైతుల పైకి దూసుకెళ్లిన గిరినాగు pic.twitter.com/Rnak1i9vuo
— Telugu Scribe (@TeluguScribe) March 29, 2025