https://oktelugu.com/

Chiranjeevi – Anil Ravipudi : ‘చిరు నవ్వుల పండుగ’.. ఓ భార్యాభర్తల కథ.. అనిల్ రావిపూడి ప్లానింగ్ అదుర్స్!

Chiranjeevi - Anil Ravipudi అనిల్ రావిపూడి అడిగిన వెంటనే క్షణం కూడా ఆలోచించకుండా ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. అంటే త్వరలోనే మనం చిరంజీవి, వెంకటేష్ ని ఒకే ఫ్రేమ్ లో వెండితెర పై చూసి పండుగ చేసుకోబోతున్నాము అన్నమాట. ఒకప్పుడు టాలీవుడ్ లో రికార్డ్స్ అన్ని వీళ్లిద్దరి చుట్టూనే తిరుగుతూ ఉండేవి.

Written By: , Updated On : March 30, 2025 / 10:08 AM IST
Follow us on

Chiranjeevi – Anil Ravipudi : మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ప్రస్తుతం చేయబోతున్న సినిమాలలో అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకర్షిస్తున్న ప్రాజెక్ట్ , అనిల్ రావిపూడి(Anil Ravipudi) తో ఆయన త్వరలో చేయబోతున్న సినిమా గురించే. ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vastunnam) లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి చేస్తున్న చిత్రమిది. కెరీర్ లో ఒక్కటంటే ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా, ఫుల్ స్వింగ్ తో ముందుకు దూసుకుపోతున్న అనిల్ రావిపూడి, ఈ చిత్రం తో కూడా తన జైత్ర యాత్ర ని కొనసాగిస్తాడని ఆశిస్తున్నారు మెగాస్టార్ అభిమానులు. స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి అయ్యింది. కొద్దిరోజుల క్రితమే ఫస్ట్ హాఫ్ స్క్రిప్ట్ ని లాక్ చేసిన అనిల్ రావిపూడి, రెండు రోజుల క్రితమే సెకండ్ హాఫ్ ని కూడా లాక్ చేసి అభిమానులకు అదిరిపోయే రేంజ్ అప్డేట్ ఇచ్చాడు. ఈ చిత్రంలో చిరంజీవి పాత్ర పేరు ‘శంకర్ వరప్రసాద్’ అని చెప్పుకొచ్చాడు.

ఇదే ట్వీట్ లో ఆయన సినిమా టైటిల్ ని కూడా ప్రకటించేశాడు కానీ, అభిమానులు దానిని గుర్తించలేకపోయారు. ఈ చిత్రానికి ‘చిరు నవ్వుల పండుగ’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఈ చిత్రం కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాగానే భార్య భర్తల నేపథ్యం లో సాగుతుందట. కొసమెరుపు ఏమిటంటే ఈ చిత్రం సెకండ్ హాఫ్ లో విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. కథ ని పూర్తిగా మలుపు తిప్పే క్యారక్టర్ లో వెంకటేష్ కనిపించబోతున్నాడట. అనిల్ రావిపూడి అడిగిన వెంటనే క్షణం కూడా ఆలోచించకుండా ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. అంటే త్వరలోనే మనం చిరంజీవి, వెంకటేష్ ని ఒకే ఫ్రేమ్ లో వెండితెర పై చూసి పండుగ చేసుకోబోతున్నాము అన్నమాట. ఒకప్పుడు టాలీవుడ్ లో రికార్డ్స్ అన్ని వీళ్లిద్దరి చుట్టూనే తిరుగుతూ ఉండేవి.

బాక్స్ ఆఫీస్ వద్ద నువ్వా నేనా అనే రేంజ్ లో వీళ్లిద్దరి సినిమాలు కొట్లాడుకున్న రోజులు ఉన్నాయి. కామెడీ, సెంటిమెంట్ ఎమోషన్స్ లో జీవించి ప్రేక్షకులకు తిరుగులేని ఎంటర్టైన్మెంట్ ని అందించే ఈ లెజెండ్స్ కలిసి ఒకే ఫ్రేమ్ లో కాసేపు కనిపించినా అభిమానులకు పండగే. టాక్ ఒక్కటి కరెక్ట్ గా వస్తే ఆకాశమే హద్దు అనే రేంజ్ లో వసూళ్లు వస్తాయి. రేపే ఈ సినిమా ఓపెనింగ్ రామానాయుడు స్టూడియోస్ లో గ్రాండ్ గా జరగనుంది. ఈ పూజ కార్యక్రమానికి విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. రేపే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ మరియు ఇతర వివరాలను తెలియచేసే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రం లో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని, అందులో ఒకరు అదితి రావు హైదరీ కాగా, మరొకరు సీనియర్ హీరోయిన్ భూమిక అని తెలుస్తుంది. చూడాలి మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందా లేదా అనేది.