Skeleton In Grave
Skeleton In Grave: గుజరాత్ రాష్ట్రంలో 2019లో వాద్ నగర్ ప్రాంతంలో యోగా భంగిమలో వెయ్యి సంవత్సరాల పురాతన ఆస్తిపంజరాన్ని ఇటీవల లక్నోలో పరీక్షించారు. దాని డిఎన్ ఏ కు రకరకాల పరీక్షలు చేశారు. డాక్టర్ నీరజ్ రాయ్ ఆధ్వర్యంలో చరిత్రకారుల బృందం ఆస్తిపంజరం డిఎన్ ఏ గురించి వెల్లడించింది. అస్తిపంజరం గురించి అనేక వివరాలు తెలుసుకునేందుకు పుర్రె, దంతాలు, చెవి భాగంలో ఉన్న ఎముక నుంచి డిఎన్ఏ నమూనాలు సేకరించింది.. యోగా భంగిమలో కనిపించిన ఆ ఆస్తిపంజరం 3000 సంవత్సరాల క్రితం వాద్ నగర్ ప్రాంతంలో విలసిల్లిన బౌద్ధ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోంది. చారిత్రాత్మక ఆధారాల ప్రకారం మధ్య ఆసియా నుంచి ప్రజలు ఈ ప్రాంతాన్ని సందర్శించేవారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వెల్లడించడానికి పురాతన శాస్త్రవేత్తలు కార్బన్ డేటింగ్ బట్టి శాస్త్రీయ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో వీటికి సంబంధించిన వివరాలు వెల్లడించనున్నారు. ఆస్తిపంజరం గురించి తెలుసుకున్నప్పటికీ.. దానికి సంబంధించి సరైన సంరక్షణ లేకపోవడంతో అది చాలావరకు పాడైపోయింది. అయితే ఇటువంటి చారిత్రాత్మక ఆధారాలను రక్షించడానికి వాద్ నగర్ ప్రాంతంలో 400 కోట్లతో పురావస్తు మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అందులో చారిత్రాత్మక ఆధారాలను భద్రపరుస్తారు..
నీరజ్ రాయ్ ఏమంటున్నారంటే..
ఆస్తిపంజరాన్ని పరీక్షిస్తున్న పురావస్తు శాఖ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నీరజ్ రాయ్ కీలకమైన విషయాలను వెల్లడించారు. ” వాద్ నగర్ ప్రాంతం పురవస్తు ఆధారాలకు కీలకంగా ఉంది. సుమారు 3000 సంవత్సరాల చరిత్ర కలిగిన నాగరికత ఇక్కడ ఉంది. ఇక్కడ తవ్వకాలు జరుపుతుంటే అనేక ఆధారాలు లభిస్తున్నాయి. మా తవ్వకాలలో భాగంగా ఒక ఆస్తిపంజరాన్ని గుర్తించాం. అయితే అది సమాధిలో యోగా బంగిమలు కనిపించింది. ఆ ఆస్తిపంజరం గుజరాత్ ప్రజలతో సరిపోలుతుందని భావించాం. 3000 సంవత్సరాల క్రితం ఒక మనిషి చనిపోతే ఖననం చేసేవారు. వాద్ నగర్ ప్రాంతం బౌద్ధ బోధన కేంద్రంగా ఉండేది. ఈ ప్రాంతంలో బౌద్ధమతం విలసిల్లిన కాలంలో ప్రపంచం నుంచి ఎంతోమంది బౌద్ధ మతాన్ని ఆచరించేవారు ఇక్కడికి వచ్చేవారు. అందువల్లే ఈ ప్రాంతం బౌద్ధ క్షేత్రంగా విలసిల్లినది. ఈ ప్రాంతంలో ఇంకా ఎన్నో పురాతన ఆస్తిపంజరాలు బయటపడే అవకాశం ఉంది. వాటికోసం తవ్వకాలు జరుపుతూ ఉంటాం. ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉంటామని” నీరజ్ వ్యాఖ్యానించారు. ” ఈ ప్రాంతంలో ఇంకా ఎన్నో ఆధారాలు లభించే అవకాశం ఉంది. అందువల్లే ఇంకా తవ్వకాలు జరపడానికి ఆస్కారం ఉంది. ప్రభుత్వం కూడా ఈ విషయాలపై విపరీతమైన ఆసక్తితో ఉందని” నీరజ్ రాయ్ పేర్కొన్నారు. మరిన్ని పరిశోధనలు చేసి చారిత్రక ఆధారాలను వెలుగులోకి తీయడానికి ప్రయత్నం చేస్తున్నామని నీరజ్ రాయ్ చెబుతున్నారు. దీనివల్ల మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు.
#WATCH | Lucknow, UP | Skeleton in ‘Samadhi’ posture found in Vadnagar, Gujarat. Investigation underway at Birbal Sahni Institute of Palaeosciences pic.twitter.com/soK02fOyMF
— ANI (@ANI) March 28, 2025