Electrical Vehicle(EV): రూ.8 లక్షలు.. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 315 కిలోమీటర్లు.. ఇది కదా.. కారంటే?

Electrical Vehicle(EV): రూ.8 లక్షలు.. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 315 కిలోమీటర్లు.. ఇది కదా.. కారంటే?

Written By: Chai Muchhata, Updated On : June 3, 2024 11:37 am

Tata Tiago Ev

Follow us on

ప్రస్తుతం Electrical Vehicle(EV)లకు డిమాండ్ పెరిగిపోతుంది. ప్రభుత్వం ఈ వెహికల్స్ ఉత్పత్తిని ఎంకరేజ్ చేయడంతో కొన్ని కంపెనీలు వీటి ఉత్పత్తిపై ఫోకస్ పెట్టాయి. అయితే ఇప్పటి వరకు రిలీజ్ అయిన కార్లు అధిక ధరను కలిగి ఉన్నాయి. అంతేకాకుండా మైలేజ్ విషయంలోనూ పరిమితులు ఉన్నాయి. కానీ లేటేస్ట్ గా టాటా కంపెనీకి చెందిన ఓ కారు అత్యధిక మైలేజ్ ను ఇస్తూ తక్కువ ధరకే అందిస్తోంది. దీంతో ఈ కారు అమ్మకాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ టాటా కంపెనీకి చెందిన ఆ కారు ఏదో తెలుసుకోవాలని ఉందా?

దేశంలోని కార్ల మార్కెట్లో అగ్ర సంస్థల్లో టాటా కంపెనీ ఒకటి, హ్యాచ్ బ్యాక్ నుంచి ఎస్ యూవీ వరకు వివిధ మోడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ కంపెనీ ఎలక్ట్రిక్ కార్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. లేటేస్ట్ గా టాటా కంపెనీ టియాగో ఈవీ తీసుకొచ్చిన సక్సెస్ అనిపించుకుంటోంది. ఇప్పటికే ఉన్న టియాగో మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఈవీ సైతం అమ్మకాల్లో దూసుకుపోతుంది. దీంతో టియాగో ఈవీ గురించి విపరీతంగా చర్చ సాగుతోంది.

tata tiago ev

టాటా టియాగో ఈవీ అల్లాయ్ వీల్స్ ను కలిగి ఉంది. ఇందులో టైర ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ అలరిస్తుంది.73.75 బీహెచ్ పీ పవర్ తో పాటు 119 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో యాంటీ లాకింగ్ బ్రేక్ సిస్టమ్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అలరిస్తుంది. టియాగో ఈవీ ఎక్కవ భద్రత ఇస్తుందని తెలుస్తోంది. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్, పిల్లల కోసం చైల్డ్ ఎంకరేజ్ సిస్టమ్ ను అమర్చారు. ఈ నేపథ్యంలో గ్లోబల్ టెస్టింగ్ లో 4 స్టార్ రేటింగ్ ను పొందింది.

టియాగో ఈవీ 19.2, 24 కిలో వాట్ల రెండు బ్యాటరీ ప్యాక్ లు కలిగి ఉన్నాయి. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ను అందిస్తోంది. 15 ఏ ఛార్జర్ తో పనిచేసే ఈ కారు 57 నిమిషాల్లో 80 శాతం చార్జింగ్ అవుతుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 250 నుంచి 315 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. రూ.7.99 లక్షల ప్రారంభం నుంచి దీనిని విక్రయించడంతో చాలా మంది కోరుకుంటున్నారు. ఇక టాప్ ఎండ్ రూ.12.62 లక్షలతో విక్రయిస్తున్నారు.